News March 19, 2025

పాడేరు: ‘రెవెన్యూ సమస్యలు త్వరగా పరిష్కరించాలి’

image

రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పాడేరులో కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. సర్వే ప్రక్రియను తహశీల్దారులు పర్యవేక్షించాలని సూచించారు. భూముల రీ సర్వేకు వారాంతపు లక్ష్యాలను నిర్దేశించాలని పేర్కొన్నారు. ఈ నెలాఖరికి 508 గ్రామాల్లో సర్వే పూర్తి చేయాలని చెప్పారు. 

Similar News

News September 17, 2025

జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను సందర్శించిన విశాఖ మేయర్

image

విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు కార్పొరేటర్లతో కలిసి అధ్యయన యాత్రలో భాగంగా జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను బుధవారం సందర్శించారు. జైపూర్ మేయర్ డా.సౌమ్య గుర్జర్‌ను శాలువ వేసి సత్కరించగా, ఆమె కూడా విశాఖ మేయర్‌కు మెమెంటో అందించారు. జైపూర్‌లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, శానిటేషన్ విధానాలు, టూరిజం చర్యలపై అధికారులు వివరాలు అందించారు.

News September 17, 2025

సౌదాగర్ అరవింద్‌ను బహిష్కరించాం: TPCC చీఫ్

image

జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ SC సెల్ ఛైర్మన్‌గా చలామణి అవుతున్న సౌదాగర్ అరవింద్‌కు పార్టీలో ఎలాంటి పదవి లేదని, ఆయనను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించడం జరిగిందని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, ఈ కారణంగా అతడిని పార్టీ నుంచి బహిష్కరించామని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

News September 17, 2025

సినీ ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్ శ్రీనివాసులు మృతి

image

రొంపిచర్ల: సినిమా, సీరియల్ రంగంలో ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్‌ పోతుల శ్రీనివాసులు(60) బుధవారం చెన్నైలో మృతి చెందారు. రొంపిచర్లలోని బెస్తపల్లికి చెందిన ఈయన 30 ఏళ్లుగా తమిళం, తెలుగు సినిమా, సీరియల్ రంగంలో ఉన్నారు. గుండెపోటు రావడంతో చెన్నైలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించినట్లు కుటుంబీకులు తెలిపారు. స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు మృతదేహాన్ని తీసుకువస్తున్నారన్నారు.