News March 19, 2025

సత్యసాయి: ‘పది సూత్రాలు తప్పక అమలు చేయాలి’

image

స్వర్ణాంధ్ర విజన్ 2047కు పది సూత్రాలు కచ్చితంగా అమలు చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రగతి నివేదికలను సిద్ధం చేయాలని పలు శాఖల అధికారులను ఆదేశించారు. నియోజకవర్గం స్థాయిలో విజన్ డాక్యుమెంట్ కార్యరూపం దాల్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

Similar News

News September 14, 2025

టాస్ గెలిచిన భారత్

image

మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా నేడు AUSతో భారత మహిళల జట్టు తొలి వన్డే ఆడనుంది. IND టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
IND: ప్రతీకా రావల్, మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్(C), రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి, స్నేహ్ రాణా, రాధా యాదవ్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్
AUS: అలీసా హీలీ(w/c), లిచ్‌ఫీల్డ్, ఎల్లీస్ పెర్రీ, మూనీ, అన్నాబెల్, ఆష్లీ, తహ్లియా మెక్‌గ్రాత్, జార్జియా, కింగ్, కిమ్ గార్త్, మేగాన్

News September 14, 2025

రానున్న 2-3 గంటల్లో వర్షం

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, యాదాద్రి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. భద్రాద్రి, HNK, HYD, BPL, JGL, JNM, KMM, ASF, మేడ్చల్, MHBD, MNCL, MUL, NLG, NRML, PDPL, రంగారెడ్డి, సంగారెడ్డి NZM, WGL జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. అటు APలోని తిరుపతి, ప.గో తదితర జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

News September 14, 2025

రేవంత్ సర్కార్‌ను జూబ్లీహిల్స్ ఓటర్లు ఆశీర్వదించాలి: మంత్రి

image

పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా HYDలో మౌలిక సదుపాయాలు కల్పన దిశగా సీఎం రేవంత్ రెడ్డి విజనరీగా పని చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం జూబ్లీహిల్స్ పరిధిలో ఆత్మీయ సమావేశాల్లో మంత్రి పాల్గొన్నారు. హైదరాబాద్ విశ్వనగరం అజెండాగా అభివృద్ధి చేయాలనే పట్టుదలతో సీఎం పనిచేస్తున్నారన్నారు. ఆయనను, ప్రజా ప్రభుత్వాన్ని జూబ్లీహిల్స్ ఓటర్లు ఆశీర్వదించాలని కోరారు.