News March 19, 2025
అన్న క్యాంటీన్‌ను పర్యవేక్షించిన కలెక్టర్

నిరుపేదల ఆకలి తీర్చి పేద ప్రజలకు అండగా వుండే అన్న క్యాంటీన్‌ను కలెక్టర్ పర్యవేక్షించారు. మంగళవారం నంద్యాలలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల సముదాయంలో నున్న అన్న క్యాంటీన్‌ను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆకస్మికంగా పరిశీలించారు. క్యాంటీన్లలో రోజువారీగా నిర్దేశించిన మెనూ ప్రకారం ఆహార పదార్థాలను ఇవ్వాలని కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు. పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
Similar News
News September 17, 2025
పాక్ ‘ఫేక్ ఫుట్‌బాల్ జట్టు’ను వెనక్కి పంపిన జపాన్

ఫుట్‌బాల్ ఆటగాళ్లమంటూ పాక్ నుంచి తమ దేశానికి వచ్చిన ఫేక్ ప్లేయర్లను జపాన్ వెనక్కి పంపింది. మాలిక్ వకాస్ అనే వ్యక్తి ఫేక్ ఫుట్‌బాల్ జట్టును సృష్టించి 22 మందిని జపాన్‌కు పంపించాడు. అయితే అక్రమంగా వచ్చిన వారిని అధికారులు హెచ్చరించి వెనక్కి పంపించారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సైతం నిర్ధారించింది. వకాస్‌ను అరెస్ట్ చేసి విచారించగా 2024లోనూ ఇదే పద్ధతిలో పంపినట్లు తెలిపాడు.
News September 17, 2025
పోలీస్ కమిషనరేట్‌లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం

వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సన్ ప్రీత్ సింగ్ కమిషనరేట్ పరిపాలన భవనం ప్రాంగణంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, అదనపు డీసీపీలు రవి, ప్రభాకర్ రావు, సురేశ్ కుమార్‌తో పాటు, ఏసీపీలు ఆర్.ఐలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్ఐలు ఇతర పోలీస్ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
News September 17, 2025
జగిత్యాల : జడ్పీ కార్యాలయంలో జెండావిష్కరణ చేసిన కలెక్టర్

ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో బుధవారం ఉదయం జగిత్యాల జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారి సత్య ప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈవో గౌతమ్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.