News March 19, 2025
లోకేశ్వరం: ‘ఫోన్ ఆర్డర్ పెడితే.. రూ.100 స్పీకర్ వచ్చింది’

రూ.వేల ఖరీదైన ఫోన్ ఆర్డర్ పెడితే రూ.100 విలువచేసే డమ్మీ స్పీకర్ రావడంతో కొనుగోలుదారుడు ఆశ్చర్యపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. లోకేశ్వరం మండలం పుస్పూర్ తండాకి చెందిన వెంకట్ జీవన్ శ్రీ ఆరోగ్య బెంగళూర్ అనే సంస్థకు చెందిన వెబ్‌సైట్‌లో శాంసంగ్ 5G రూ.16 వేల ఫోన్ కేవలం రూ.3,500కు వస్తుందని చూసి పేమెంట్ చేశాడు. ఆర్డర్ వచ్చాక వేచి చూస్తే రూ.100 విలువ చేసే సౌండ్ బాక్స్ వచ్చిందని వాపోయాడు.
Similar News
News November 8, 2025
GNT: పేదవారికి ఉచితం.. రోగ నిర్ధారణలో కీలకం

ప్రతి సంవత్సరం నవంబరు 8న అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఎక్స్-రేను కనుగొన్న రోజును పురస్కరించుకొని ఈ దినోత్సవం జరుపుకుంటారు. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలోని రేడియాలజీ విభాగ సేవలు మరువలేనివి. అంతో ఖర్చుతో కూడిన MRI,CT, ఆల్ట్రాసౌండ్,Xray వంటి సేవలను ఉచితంగా ప్రజలకి అందించడంతో సామాన్యుల రోగ నిర్ధారణ సులభమైంది.
News November 8, 2025
HYD: ఓయూ UGC వ్యవహారాల డీన్‌గా బి.లావణ్య

ఉస్మానియా విశ్వవిద్యాలయం అభివృద్ధి &UGC వ్యవహారాల డీన్‌గా ప్రొఫెసర్ బి.లావణ్య పదవీకాలాన్ని పొడిగించారు. ప్రస్తుతం డీన్, అభివృద్ధి & UGC వ్యవహారాలుగా పనిచేస్తున్న చరిత్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్ బి.లావణ్య పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగిస్తున్నట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈరోజు ప్రకటించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ ఎం.మోలుగారం ప్రొఫెసర్ లావణ్యకు అధికారిక ఉత్తర్వులు అందజేశారు.
News November 8, 2025
VKB: రైతులు దళారుల బారిన పడొద్దు: అదనపు కలెక్టర్

రైతులు పండించిన పంటలను దళారులకు అమ్మి మోసపోవద్దని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ సూచించారు. తాండూర్‌లో ఏర్పాటు చేసిన వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడుతూ.. వరి ధాన్యానికి ఏ గ్రేడ్‌కు రూ.2389, సన్న రకాలకు రూ.2369తో పాటు బోనస్‌గా రూ.500 చెల్లిస్తామని, సాధారణ రకాలకు రూ.2369 మద్దతు ధర ఇవ్వనున్నట్లు తెలిపారు. మొక్కజొన్నకు కూడా రూ.2400 మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.


