News March 19, 2025
IPL: మిడిలార్డర్‌లో KL బ్యాటింగ్?

ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్న KL రాహుల్ బ్యాటింగ్ పొజిషన్‌పై చర్చ జరుగుతోంది. టీ20ల్లో ఓపెనర్‌గా ఆడే అతను ఈసారి టీమ్ కోసం మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయినట్లు వార్తలొస్తున్నాయి. మెక్‌గుర్క్, డూప్లెసిస్ ఓపెనర్లుగా, అభిషేక్ పోరెల్ మూడో స్థానంలో, KL, అక్షర్, స్టబ్స్ మిడిలార్డర్‌లో ఆడతారని సమాచారం. DC తన తొలి మ్యాచును ఈనెల 24న వైజాగ్ వేదికగా LSGతో ఆడనుంది.
Similar News
News March 19, 2025
ట్రాన్స్‌జెండర్ హత్య.. నిందితులను కఠినంగా శిక్షించాలన్న CM

AP: అనకాపల్లి(D)లో జరిగిన ట్రాన్స్‌జెండర్ హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను CM చంద్రబాబు ఆదేశించారు. త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలన్నారు. బయ్యవరం కల్వర్టు వద్ద దుప్పటిలో చుట్టిన మృతదేహం కనిపించగా, పోలీసులు విచారణ చేపట్టారు. దీపు అనే ట్రాన్స్‌జెండర్‌ను చంపి శరీరాన్ని ముక్కలు చేసినట్లు గుర్తించి, నిందితులను అరెస్ట్ చేశారు. దీపు కొంతకాలంగా ఓ వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు సమాచారం.
News March 19, 2025
తెలంగాణ బడ్జెట్(2025-26) కేటాయింపులు

* విద్యుత్ రంగం-రూ.21,221 కోట్లు
* పురపాలక రంగం- రూ.17,677 కోట్లు
* వైద్య రంగం-రూ.12,393 కోట్లు
* హోంశాఖ-రూ.10,188 కోట్లు
* రహదారులు, భవనాల శాఖ-రూ.5,907 కోట్లు
* అటవీ, పర్యావరణం-రూ.1,023 కోట్లు
* క్రీడలు- రూ.465 కోట్లు
* దేవాదాయ శాఖ- రూ.190 కోట్లు
News March 19, 2025
తెలంగాణ బడ్జెట్: ఏ శాఖకు ఎంతంటే?

* పశుసంవర్ధకం: రూ.1,674 కోట్లు
* పౌరసరఫరాల శాఖ: రూ.5,734 కోట్లు
* కార్మిక శాఖ-రూ.900 కోట్లు
* మహిళా శిశు సంక్షేమ శాఖ-రూ.2,862 కోట్లు
* బీసీ సంక్షేమ శాఖ-రూ.11,405 కోట్లు
* మైనార్టీ సంక్షేమ శాఖ-రూ.3,591 కోట్లు
* పరిశ్రమలు-రూ.3,527 కోట్లు
* ఐటీ రంగం-రూ.774 కోట్లు
* చేనేత రంగం-రూ.371 కోట్లు