News March 19, 2025

VKB: పదో తరగతి పరీక్షలు… కలెక్టర్ కీలక ఆదేశాలు

image

పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పరీక్షా కేంద్రంలోనికి సెల్ ఫోన్ అనుమతించకూడదన్నారు. తగు ఏర్పాట్లు చేయాలని అధికారులకు తెలిపారు.

Similar News

News March 19, 2025

హిందూపురం వ్యక్తి దారుణ హత్య

image

శ్రీ సత్యసాయి జిల్లా మలుగూరు సమీపంలో హిందూపురానికి చెందిన సద్దాం(35) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరగగా.. బుధవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. హిందూపురం రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News March 19, 2025

పెద్దపల్లి: ఈ- హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌పై అవగాహన సదస్సు

image

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అన్నా ప్రసన్న కుమారి ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్ లకు అవగాహన సదస్సు నిర్వహించారు. డేటా ఎంట్రీ చేయుటకు డిజిగ్నేటెడ్ చేయబడిన సిబ్బందికి eHMIS(ఈ – హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) పైన శిక్షణ ఇచ్చారు. రోగుల వివరాలు డిజిటలైజేషన్ చేయడానికి ఈ పోర్టల్ ఏర్పాటు చేశారని తెలిపారు.

News March 19, 2025

IPLలో పర్పుల్ క్యాప్ హోల్డర్స్

image

*2008- సోహైల్ తన్వీర్ *2009- ఆర్పీ సింగ్
*2010- ప్రజ్ఞాన్ ఓఝా *2011- లసిత్ మలింగ
*2012- మోర్నే మోర్కెల్ *2013- డ్వేన్ బ్రావో
*2014- మోహిత్ శర్మ *2015- డ్వేన్ బ్రావో
*2016, 17- భువనేశ్వర్ కుమార్ *2018- ఆండ్రూ టై
*2019- ఇమ్రాన్ తాహిర్ *2020- కగిసో రబాడ
*2021- హర్షల్ పటేల్ *2022- యుజువేంద్ర చాహల్
*2023- మహమ్మద్ షమీ *2024- హర్షల్ పటేల్
*2025- ?

error: Content is protected !!