News March 19, 2025
యాదాద్రి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పనుల పక్రియ పూర్తి చేయాలి: కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారుల నిర్మాణాల పనుల ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు. మంగళవారం రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీడీవోలకు, మున్సిపల్ కమిషనర్లకు, ఎంపీవోలతో ఇందిరమ్మ ఇళ్లకు, తాగు నీరు, పన్ను వసూళ్లు, ఎల్అర్ఎస్‌లపై అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలసి మండలాల వారిగా సమీక్షించారు.
Similar News
News January 4, 2026
సత్య సాయి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ks షాన్వాజ్

కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో భాగంగా సత్యసాయి జిల్లా అధ్యక్షుడిగా ks షాన్వాజ్‌ని ఆ పార్టీ అధిష్టానం నియమించింది. జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలకి కృతజ్ఞతలు తెలిపారు.
News January 4, 2026
వనపర్తి: మాధురానగర్‌లో అప్పుల బాధతో ఆత్మహత్య

వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక మధురానగర్‌లో వనపర్తి జిల్లా ఆత్మకూరుకు చెందిన రవి(25) అనే వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన రవి, చికిత్స పొందుతూ మృతి చెందాడు. వడ్డీ వ్యాపారుల ఒత్తిడి వల్లే రవి ఈ నిర్ణయం తీసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మధురానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News January 4, 2026
రేవంత్ నాలుక కోయాలి: హరీశ్ రావు

తెలంగాణ ఏర్పడ్డాక 42 రోజుల్లోనే కృష్ణాలో 69% నీళ్ల కోసం కేంద్రానికి KCR లేఖ రాశారని హరీశ్ రావు తెలిపారు. ‘కాంగ్రెస్, TDP ద్రోహం వల్లే కృష్ణాలో 299 TMCలు వచ్చాయి. కానీ గోదావరిలో 933 TMCలకు మేం అనుమతులు సాధించాం. సభలో అబద్ధాలు చెప్పిన సీఎం రాజీనామా చేయాలి. అబద్ధాలు చెప్పినందుకు రేవంత్ నాలుక కోయాలి. ఇలా మాట్లాడుతున్నందుకు నాపై దాడి చేయించవచ్చు. అవసరమైతే హత్యాయత్నం చేయించవచ్చు’ అని కామెంట్ చేశారు.


