News March 19, 2025
నాగర్‌కర్నూల్ జిల్లాలో విషాదం.. మహిళ ఆత్మహత్య

ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లిలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బిజినపల్లి వాసి బత్తుల లక్ష్మి(48) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పు అంటించుకుంది. చుట్టుపక్కల వారు గమనించేసరికి ఇంట్లో మంటలు ఎగిసిపడి అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ సయ్యద్ అలీ తెలిపారు.
Similar News
News March 19, 2025
తెలంగాణ బడ్జెట్(2025-26) కేటాయింపులు

* విద్యుత్ రంగం-రూ.21,221 కోట్లు
* పురపాలక రంగం- రూ.17,677 కోట్లు
* వైద్య రంగం-రూ.12,393 కోట్లు
* హోంశాఖ-రూ.10,188 కోట్లు
* రహదారులు, భవనాల శాఖ-రూ.5,907 కోట్లు
* అటవీ, పర్యావరణం-రూ.1,023 కోట్లు
* క్రీడలు- రూ.465 కోట్లు
* దేవాదాయ శాఖ- రూ.190 కోట్లు
News March 19, 2025
తెలంగాణ బడ్జెట్: ఏ శాఖకు ఎంతంటే?

* పశుసంవర్ధకం: రూ.1,674 కోట్లు
* పౌరసరఫరాల శాఖ: రూ.5,734 కోట్లు
* కార్మిక శాఖ-రూ.900 కోట్లు
* మహిళా శిశు సంక్షేమ శాఖ-రూ.2,862 కోట్లు
* బీసీ సంక్షేమ శాఖ-రూ.11,405 కోట్లు
* మైనార్టీ సంక్షేమ శాఖ-రూ.3,591 కోట్లు
* పరిశ్రమలు-రూ.3,527 కోట్లు
* ఐటీ రంగం-రూ.774 కోట్లు
* చేనేత రంగం-రూ.371 కోట్లు
News March 19, 2025
ముకుంద జువెలర్స్ వార్షికోత్సవ వేడుకలు

ముకుంద జువెలర్స్ కూకట్‌పల్లి బ్రాంచ్ 2వ వార్షికోత్సవం, కొత్తపేట బ్రాంచ్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా సంస్థ ఉద్యోగులకు బహుమతులు ప్రదానం చేశారు. రెండు సంవత్సరాల్లోనే 6 బ్రాంచులు స్థాపించడం సంతోషంగా ఉందని, కస్టమర్ల నమ్మకమే తమ సంస్థ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. సేల్స్ పెంచిన ఉద్యోగులకు కార్లు, బైకులు, టీవీలు, ఎలక్ట్రానిక్ వస్తువులు బహుమతిగా అందజేశారు.