News March 19, 2025
గద్వాలలో దారుణం..!

గద్వాల మండలం చేనుగోనిపల్లిలో దారుణం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. వృద్ధులపై గుర్తుతెలియని దుండగులు విచక్షణారహితంగా దాడి చేశారు. అనాథలైన వృద్ధులపై మానవమృగాలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు గద్వాల ఆసుపత్రికి తరలించారు. కాగా వృద్ధుల్లో ఒకరికి కళ్లు కనిపించవు. మరొకరికి మతిస్థిమితం సరిగా లేదు.. మానవత్వం మరిచి వృద్ధులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారు కోరారు.
Similar News
News July 6, 2025
గుమ్మడిదల: ఇన్స్‌పైర్ అవార్డ్స్‌కు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల నుంచి ఇన్స్‌పైర్ అవార్డులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సైన్స్ అధికారి సిద్దారెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 15లోగా https://www. inspireawards-dst.gov.in వెబ్ సైట్లో అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
News July 6, 2025
కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోండి: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం తెలిపారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో పీజీఆర్ఎస్ ద్వారా అధికారులు ఫిర్యాదులు స్వీకరిస్తారన్నారు. ఉదయం 10 గంటల నుంచి 1.30 వరకు పీజీఆర్ఎస్ జరుగుతుందన్నారు. అలాగే మీకోసం కాల్ సెంటర్ 1100 నంబర్‌కు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News July 6, 2025
శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

AP: శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల, సుంకేశుల నుంచి 1.86 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. విద్యుత్ ఉత్పత్తి కోసం 67వేల క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు నుంచి 10వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గానూ ప్రస్తుతం 879.30 అడుగులకు నీరు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలకు ప్రస్తుతం 180.42 TMCలుగా ఉంది. 2 రోజుల్లో గేట్లు ఎత్తే ఛాన్స్ ఉంది.