News March 19, 2025
వడదెబ్బ తాకకుండా ఈ చిట్కాలు పాటించండి

కాటన్ వస్త్రాలను ధరించాలి, బయటకు వెళ్లేటప్పుడు వెంట గొడుగు తీసుకెళ్లండి లేదా టోఫి ధరించండి. రోజుకు 3నుంచి 4లీటర్ల నీరు తప్పనిసరిగా తాగుతూ ఉండాలి. ఎండలో పనిచేసేవారు మరింత అధికంగా నీటిని తీసుకోవాలి. కొబ్బరినీళ్లు, ఉప్పు, పంచదార కలిపిన వాటర్ తీసుకుంటూ ఉంటే శరీరం డీ హైడ్రేట్ కాకుండా ఉంటుంది. పండ్ల రసాలు, మజ్జిగ లాంటివి తాగుతూ ఉండండి. అత్యవసరమైతే తప్ప ఎండలో బయటకి వెళ్లకూడదు.
Similar News
News March 19, 2025
పరీక్షలకంటే అంత ఇంపార్టెంట్ ఇంకేముంది?

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు సజావుగా సాగుతున్నాయి. అయితే, ఏడాదంతా కాలేజీలకు వెళ్లిన వేలాది స్టూడెంట్స్ పరీక్షలకు గైర్హాజరవుతున్నారు. తొలి పరీక్షను ఏకంగా 17వేల మంది రాయలేదు. నిన్న ఫిజిక్స్ & ఎకనామిక్స్ పరీక్షలు జరగ్గా 13,403 మంది డుమ్మా కొట్టారు. పరీక్షలకంటే అంత ఇంపార్టెంట్ ఇంకేముంటుంది? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రాను రాను విద్యార్థులు చదువును మరింత నెగ్లెక్ట్ చేస్తున్నారనే విమర్శలొస్తున్నాయి.
News March 19, 2025
కొత్త పథకాన్ని ప్రకటించిన ప్రభుత్వం

TG బడ్జెట్‌లో ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది. ‘ఇందిర గిరి జల వికాసం’ పేరుతో నూతన స్కీమును అమలు చేయనున్నట్లు తెలిపింది. పోడుభూములు సాగు చేసుకునే గిరిజన రైతులకు సౌర ఆధారిత పంపుసెట్ల ద్వారా సాగునీటి సరఫరా చేయనుంది. పోడు భూముల్లో అటవీ ఉత్పత్తులు, తోటల పెంపకానికి ప్రోత్సాహం అందివ్వనుంది. 2.1 లక్షల రైతులకు ఈ సౌకర్యం కల్పించనుంది. నాలుగేళ్లలో గిరిజనుల అభివృద్ధికి రూ.12,600 కేటాయిస్తామని పేర్కొంది.
News March 19, 2025
ముంబై ఫస్ట్ మ్యాచ్.. కెప్టెన్‌గా సూర్య

IPL-2025: ముంబై ఈ సీజన్లో ఆడే తొలి మ్యాచులో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చేయనున్నారు. ఈ విషయాన్ని కెప్టెన్ హార్దిక్ పాండ్య వెల్లడించారు. గత సీజన్లో చివరి మ్యాచులో స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ పాండ్యపై నిషేధం పడింది. దీంతో ఆ స్టార్ ఆల్‌రౌండర్ మార్చి 23న చెన్నైతో జరిగే తొలి మ్యాచుకు అందుబాటులో ఉండరు.