News March 19, 2025
అద్భుతం.. సుద్ద ముక్కతో మక్కా మజీద్

ప్యాపిలి మండలం వెంగళంపల్లికి చెందిన ప్రముఖ చిత్రకారుడు మధుకృష్ణ శుద్ధ ముక్కతో అద్భుతాన్ని సృష్టించాడు. మక్కా మజీద్ నమూనాను తయారు చేసి అందరినీ ఆకర్షించాడు. ప్రస్తుతం ముస్లింలకు అత్యంత పవిత్ర రంజాన్ మాసం కావడంతో ఈ నమూనాను తయారు చేసినట్లు మధుకృష్ణ వెల్లడించారు. చిత్రకారుడిని గ్రామస్థులు ప్రత్యేకంగా అభినందించారు.
Similar News
News January 16, 2026
HYD: రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు ఇంటికే!

నూతన వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఇకపై RTA కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. కొత్త సాఫ్ట్‌వేర్ అమలుకు HYD యంత్రాంగం కసరత్తు చేస్తోందని ఓ అధికారి తెలిపారు. వాహనదారుడు షోరూమ్‌లోనే డీలర్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయవచ్చన్నారు. అనంతరం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ డైరెక్ట్‌గా పోస్టు ద్వారా ఇంటికే చేరుతుందని పేర్కొన్నారు. ఇది ప్రజలకు సమయం, శ్రమ ఆదా చేసే విధానమని తెలిపారు.

KMR: ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఆశావాహులు

కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో రానున్న మున్సిపల్ ఎలక్షన్స్ లో పోటీ చేయబోయే ఆశావాహులు ఇటు ఓటర్లను, అటు అదిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కొందరు ప్రజల దాహార్తి తీర్చేందుకు కమ్యూనిట్ బోర్లు బాగు చేయిస్తే, పండగ నేపథ్యంలో స్వీట్లు, మాంసాహారం పంచుతున్నారు. మరికొందరు ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. దీంతో మున్సిపల్‌లో రాజకీయం వేడెక్కింది.