News March 19, 2025

సంగారెడ్డి: పాఠశాలలపై చర్యలు: డీఈవో

image

జిల్లాలో ఈనెల 15 నుంచి ప్రారంభమైన హాఫ్‌డే స్కూల్స్ నడుపని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. జిల్లాలో కొన్ని ప్రైవేటు పాఠశాలల ఒంటి పూట బడులు నడపడం లేదని, పూర్తి రోజు పాఠశాలలను నడిపిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News March 19, 2025

తెలంగాణ బడ్జెట్: ఏ శాఖకు ఎంతంటే?

image

* పశుసంవర్ధకం: రూ.1,674 కోట్లు
* పౌరసరఫరాల శాఖ: రూ.5,734 కోట్లు
* కార్మిక శాఖ-రూ.900 కోట్లు
* మహిళా శిశు సంక్షేమ శాఖ-రూ.2,862 కోట్లు
* బీసీ సంక్షేమ శాఖ-రూ.11,405 కోట్లు
* మైనార్టీ సంక్షేమ శాఖ-రూ.3,591 కోట్లు
* పరిశ్రమలు-రూ.3,527 కోట్లు
* ఐటీ రంగం-రూ.774 కోట్లు
* చేనేత రంగం-రూ.371 కోట్లు

News March 19, 2025

ముకుంద జువెలర్స్ వార్షికోత్సవ వేడుకలు

image

ముకుంద జువెలర్స్ కూకట్‌పల్లి బ్రాంచ్ 2వ వార్షికోత్సవం, కొత్తపేట బ్రాంచ్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా సంస్థ ఉద్యోగులకు బహుమతులు ప్రదానం చేశారు. రెండు సంవత్సరాల్లోనే 6 బ్రాంచులు స్థాపించడం సంతోషంగా ఉందని, కస్టమర్ల నమ్మకమే తమ సంస్థ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. సేల్స్ పెంచిన ఉద్యోగులకు కార్లు, బైకులు, టీవీలు, ఎలక్ట్రానిక్ వస్తువులు బహుమతిగా అందజేశారు.

News March 19, 2025

మెరుగైన విద్యుత్ అందించాలి: ఎన్పీడీసీఎల్ సీఎండీ

image

విద్యుత్ వినియోగదారులకు మెరుగైన నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు అధికారులు తగు చర్యలు తీసుకోవాలని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి సూచించారు. హనుమకొండలోని నక్కలగుట్ట విద్యుత్ భవన్ పరిధిలోని 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలు, ఏడీఈలు, ఏఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లోడ్ పెరిగే ఛాన్స్ ఉన్న సర్కిల్లో పవర్ ట్రాన్స్ ఫార్మర్లు, ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.

error: Content is protected !!