News March 19, 2025
మెదక్: యువకుడి సూసైడ్

ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజాంపేట మండలంలో జరిగింది. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన గరుగుల భాను(19) మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో దుబ్బాక ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 19, 2025
మెదక్ జిల్లాలో వెయ్యేళ్ల నాటి శిల్పాలు

చిన్నశంకరంపేట మండలం మడూరు శివాలయం వద్ద అద్భుతంగా చెక్కిన రాష్ట్రకూట, కళ్యాణిచాళుక్య, కాకతీయ శైలుల శిల్పాలు లభించాయని ఔత్సాహిక చరిత్ర పరిశోధకుడు బుర్ర సంతోష్ తెలిపారు. కళ్యాణి చాళుక్య శైలిలో ఆభరణాలతో చెక్కిన యోగశయనమూర్తి విగ్రహం యోగముద్రలో శేషతల్పంపై పడుకుని ఉన్న విష్ణుమూర్తి, లక్ష్మీదేవి శిల్పం ద్వారపాలకులు, అష్టభుజ మహిషాసురమర్ధిని, సరస్వతీ దేవి విగ్రహం, చతుర్భుజ విష్ణు విగ్రహాలు ఉన్నాయన్నారు.
News March 19, 2025
ఎస్సీ వర్గీకరణ బిల్లుపై మంత్రి దామోదర్ కామెంట్స్

ఎస్సీ వర్గీకరణ హేతు వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టడం ఇదో చారిత్రాత్మకమైన రోజు అని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. వివక్షను రూపుమాపేందుకు తెచ్చిన రిజర్వేషన్ ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు వర్గీకరణ బిల్లును తెచ్చామని మంత్రి వెల్లడించారు.
News March 19, 2025
మెదక్‌లో తల్లీకూతురు మిస్సింగ్.. కేసు నమోదు

మెదక్ పట్టణం బ్రాహ్మణ వీధికి చెందిన చెందిన ఎం. విజయలక్ష్మి(54) తన కూతురు ఎం. మణిదీపిక (27)లు సోమవారం మిస్ అయ్యారు. మెదక్‌లోని వారి ఇంట్లో నుంచి వెళ్లిన వీరు ఇద్దరూ కనిపించట్లేదని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరు ఎక్కడైనా కనిపిస్తే 8712657878, 8712657913 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు సూచించారు.