News March 19, 2025

నాగర్‌కర్నూల్ జిల్లాకు ఎల్లో WARNING

image

నాగర్‌కర్నూల్ జిల్లాకు హైదరాబాద్ వాతావరణ శాఖ మంగళవారం ఎల్లో వార్నింగ్ జారీ చేసింది. మంగళవారం జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో 36 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను నమోదయ్యాయని వాతావరణ శాఖ నివేదిక పేర్కొంది. రాబోయే రెండు, మూడు రోజుల వరకు జిల్లాలో సుమారు 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Similar News

News March 20, 2025

BRS ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించలేదు: దేవరకద్ర ఎమ్మెల్యే

image

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి గురువారం మదనాపురం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన మాట మేరకు ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రజలకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా నిర్మించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పేదల ప్రభుత్వమన్నారు.   

News March 20, 2025

పాడేరు: ‘నాటుసారా నిర్మూలనే నవోదయం 2.0 లక్ష్యం’

image

నాటుసారా నిర్మూలనే నవోదయం 2.0 లక్ష్యమని కలెక్టర్ దినేశ్ కుమార్ స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్ నుంచి నాటుసారా నివారణపై రెవెన్యూ, అటవీశాఖ, పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అక్రమ నాటుసారా తయారీదారులపై దాడులు నిర్వహించి, కేసులు నమోదు చేయాలని సూచించారు. నాటుసారా నివారణకు గ్రామస్థులు, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని తెలిపారు. అలాగే ప్రత్యేకాధికారులను నియమిస్తామన్నారు.

News March 20, 2025

IPL రూల్స్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం

image

IPLలో కొన్ని రూల్స్‌పై బీసీసీఐ BCCI కీలక నిర్ణయం తీసుకుంది. సలైవాపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై బౌలర్లు బంతిపై ఉమ్మి రుద్దుకోవచ్చని తెలిపింది. ఈ నిర్ణయం బౌలర్లకు కలిసొస్తుంది. అలాగే సెకండ్ ఇన్నింగ్స్‌లో 2 బంతులు వినియోగించుకోవచ్చని పేర్కొంది. రెండో ఇన్నింగ్స్ 11 ఓవర్ల తర్వాత రెండో బంతిని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను యథావిధిగా కొనసాగించనుంది.

error: Content is protected !!