News March 19, 2025
సెన్సార్లు అమర్చాలని అనకాపల్లి కలెక్టర్ సూచన

పరిశ్రమలలో రసాయనాల లీకేజ్ లను గుర్తించే సెన్సార్లను బయట లోపల అమర్చాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ సూచించారు. కలెక్టరేట్లో జిల్లా సంక్షోభ నివారణ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. పరిశ్రమలలో ప్రమాదాలు జరిగితే సమాచారాన్ని వెంటనే జిల్లా యంత్రాంగానికి తెలియ చేయాలన్నారు. జిల్లాలో గల 12 రసాయన పరిశ్రమలలో మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు.
Similar News
News March 19, 2025
NGKL: 26వ రోజు కొనసాగుతున్న సహాయక చర్యలు

శ్రీశైలం ఎడమ గట్టు ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు ఉద్ధృతంగా కొనసాగుతున్నాయి. 26వ రోజు బుధవారం మరోసారి క్యాడవర్ డాగ్స్ బృందం సహాయక చర్యల్లో పాల్గొనేందుకు టన్నెల్‌లోకి వెళ్లారు. రెస్క్యూ ఆపరేషన్ మరింత వేగవంతం చేశారు. జిల్లా కలెక్టర్ భాగవత్ సంతోష్ సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఏడుగురి ఆచూకీ కనుగొనేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
News March 19, 2025
కురుమూర్తిలో రూ.110 కోట్లతో అభివృద్ధి పనులు: భట్టి

ఉమ్మడి MBNR జిల్లాలోని పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి దేవాలయం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బడ్జెట్‌లో విడుదల చేసిన రూ.110 కోట్లతో ఘాట్ రోడ్డు, నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు ఇప్పటికే మొదలైనట్లు చెప్పారు.
News March 19, 2025
బూర్గంపాడ్: రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన బుధవారం భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలంలో జరిగింది. భద్రాచలం క్రాస్ రోడ్డు సమీపంలోని రాంపురం వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టిన ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు రాంపురం గ్రామస్థుడిగా గుర్తించినట్లు సమాచారం.