News March 19, 2025
కొత్తపల్లి: మనవడని దత్తత తీసుకుంటే.. నమ్మించి మట్టుబెట్టాడు!

కొత్తపల్లి మండల శివారులో ఈనెల 15న వెంకటమ్మ అనే వృద్ధురాలు హత్యకు గురైన విషయం తెలిసిందే. వెంకటమ్మను హత్య చేసిన మనవడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వెంకటమ్మకు కొడుకులు లేకపోవడంతో బిడ్డ కొడుకుని దత్తతకు తీసుకుని వివాహం జరిపించింది. వెంకటమ్మ వద్ద ఉన్న డబ్బు, బంగారం కోసం తరచూ ఇబ్బందులు పెట్టడంతో బంధువుల ఇంటి వద్ద ఉంటోంది. LIC డబ్బులు వచ్చాయని పిలిపించి హత్యచేసి పారిపోగా పోలీసులు అరెస్టు చేశారు
Similar News
News January 19, 2026
కరీంనగర్ ప్రజావాణిలో 250 దరఖాస్తుల స్వీకరణ

ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యమిచ్చి వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి నిర్వహించగా అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్‌తో కలిసి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి 250 దరఖాస్తులు స్వీకరించారు. కొన్ని దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించగా మరికొన్నింటిని బదిలీ చేశారు.
News January 19, 2026
ప్రతి పాఠశాలను సందర్శించాలి: కరీంనగర్ కలెక్టర్

కరీంనగర్ జిల్లాలోని ప్రతి పాఠశాలను ప్రత్యేక అధికారులు ఈ నెలాఖరులోపు సందర్శించి, నివేదిక సమర్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. పదోతరగతి పరీక్షల సన్నద్ధత, మధ్యాహ్న భోజన నాణ్యత, తాగునీరు, మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. గ్యాస్ కనెక్షన్లు, విటమిన్ గార్డెన్ల నిర్వహణపై దృష్టిసారించాలని, సమస్యలను తమ దృష్టికి తేవాలన్నారు.
News January 19, 2026
KNR: రాష్ట్రస్థాయి కార్టూన్ల ప్రదర్శన ప్రారంభం

తెలంగాణ కార్టూనిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో SRR డిగ్రీ, పీజీ కళాశాలలో రాష్ట్రస్థాయి కార్టూన్ల ప్రదర్శనను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సోమవారం ప్రారంభించారు. ఎస్ఆర్ఆర్ కళాశాల తెలుగు విభాగం సహకారంతో సోమ, మంగళవారాల్లో ఈ కార్టూన్ల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్రం నలుమూలలకు చెందిన వివిధ కార్టూనిస్టుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయని అన్నారు.


