News March 19, 2025

విజయవాడ మీదుగా నడిచే 2 రైళ్లు రద్దు

image

నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా నడిచే 2 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.22875 విశాఖపట్నం – గుంటూరు, నం.22876 గుంటూరు- విశాఖపట్నం ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఈ నెల 24న రద్దు చేశామని, ప్రయాణికులు గమనించాలని కోరుతూ రైల్వే అధికారులు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

Similar News

News July 6, 2025

శ్రీకాకుళం: అతని నేత్రాలు సజీవం

image

శ్రీకాకుళం నగరంలోని డీసీసీబీ కాలనీకి చెందిన పడాల. నారాయణ రావు(84) శనివారం మృతి చెందారు. అతని నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకుని రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ జగన్మోహన్ రావుకు తెలియజేశారు. డాక్టర్ కె.సుదీర్ పర్యవేక్షణలో మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్ సుజాత, చిన్ని కృష్ణ ద్వారా అతని కార్నియాలు సేకరించారు. విశాఖపట్నం ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు.

News July 6, 2025

HYD: మొహరం స్పెషల్.. బీబీ కా అలమ్‌ గురించి తెలుసా..!

image

బీబీ కా ఆలం హైదరాబాద్‌లోని ప్రముఖ శియా ముస్లిం పవిత్ర ధ్వజం(అలమ్)గా ప్రసిద్ధి చెందింది. ఇది ప్రతి సంవత్సరం మొహరం నెలలో, ముఖ్యంగా ఆశురా రోజున వైభవంగా జరిగే ఊరేగింపులో ప్రజల దర్శనార్థం ఉంచుతారు. ఈ అలమ్‌ను ఖాసా అలంకరించిన ఏనుగుపై ఊరేగించడం అనేది కుతుబ్ షాహీ, ఆసఫ్ జాహీ పరిపాలన కాలం నాటి సంప్రదాయం. దీన్ని బీబీ ఫాతిమా(ప్రవక్త మహమ్మద్ కుమార్తె) స్మృతిగా భావిస్తారు.

News July 6, 2025

ఈనెల 10న మెగా పేరెంట్స్ మీట్: కలెక్టర్

image

ఈనెల 10న జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలో మెగా పేరెంట్స్ మీట్ నిర్వహిస్తున్నామని కలెక్టర్ వెట్రిసెల్వి శనివారం తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ 2,368 పాఠశాలు, 140 జూనియర్ కాలేజీల్లో చదివే 2,90,545 మంది విద్యార్థులు, కాలేజీలోని 35,920 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. పిల్లలతో అమ్మ పేరుపై  లక్షా 64 వేల 170 మొక్కలను నాటిస్తామన్నారు.