News March 19, 2025
ఫొటో సెషన్‌నే నా జీవితంలో మైలురాయి: MLA సింధూర

శాసనసభలో ఫొటో సెషన్ నా జీవితంలో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర పేర్కొన్నారు. నియోజవర్గంలోని ప్రజల సమస్యలను సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని, బడ్జెట్ సమావేశాలు ముగింపు సందర్భంగా శాసన సభ్యులతో కలిసి దిగిన ఫొటో తన జీవితంలో మొదటి జ్ఞాపకంగా నిలిచిపోతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Similar News
News March 19, 2025
బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో సమావేశమయ్యారు. వీరిద్దరు సుమారు 40 నిమిషాల పాటు పలు ఒప్పందాలపై చర్చించారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, ఉద్యోగాల కల్పనలో ఏఐ వినియోగంపై సమాలోచనలు జరిపారు. స్వర్ణాంధ్రప్రదేశ్-2047 విజన్ కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకోసం గేట్స్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యం కలిసివస్తుందని CBN పేర్కొన్నారు.
News March 19, 2025
చాహల్-ధనశ్రీ విడాకులపై రేపు తీర్పు

చాహల్, ధనశ్రీ విడాకుల పిటిషన్‌పై రేపటిలోగా తీర్పు ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టును బాంబే హైకోర్టు ఆదేశించింది. కూలింగ్ ఆఫ్ వ్యవధిని మినహాయించాలన్న పిటిషన్‌ను ఫ్యామిలీ కోర్టు తిరస్కరించగా, ఆ నిర్ణయాన్ని HC రద్దు చేసింది. చాహల్ IPLలో పాల్గొనాల్సి ఉన్నందున రేపటిలోగా తీర్పు ఇవ్వాలని సూచించింది. 2020లో వీరికి పెళ్లవగా, కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. చాహల్ రూ.4.75కోట్ల భరణం చెల్లించడానికి అంగీకరించారు.
News March 19, 2025
ఉస్మానియా.. గత వైభవం ఏది?

తెలంగాణకు గర్వకారణమైన ఉస్మానియా యూనివర్సిటీ సమస్యల వలయంలో చిక్కుకుంది. ఫుడ్ బాగుండట్లేదని, బొద్దింకలు, వెంట్రుకలు వస్తున్నాయని విద్యార్థులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇటీవల ఏకంగా బ్లేడ్ రావడం కలకలం రేపింది. ఉదయం నీళ్లు లేకపోవడంతో స్నానం చేయకుండానే క్లాసులకు వెళ్లాల్సి వస్తోందంటున్నారు. ఫ్యాకల్టీ సైతం రోజూ రావట్లేదని చెబుతున్నారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. COMMENT?