News March 19, 2025

టేకుమట్ల: రూ.10 లక్షల బీమా చెక్కు అందజేత

image

టేకుమట్ల మండలం వెల్లంపల్లి గ్రామానికి చెందిన సొల్లేటి రాములు ప్రమాదవశాత్తు గతేడాది వాగులో పడి మృతి చెందాడు. కాగా పోస్ట్ ఆఫీసులో ప్రమాద బీమా చేయించుకున్న రాములు కుటుంబ సభ్యులకు మంగళవారం పోస్టల్ సూపరింటెండెంట్ హనుమంతు, రామకృష్ణ, స్పెషల్ ఆఫీసర్ శైలజ, ఎంపీడీవో అనిత, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోటగిరి సతీశ్ చేతుల మీదుగా రూ.10 లక్షల బీమా చెక్కును అందజేశారు. బీమాతో కుటుంబం ధీమాగా ఉంటుందన్నారు.

Similar News

News July 6, 2025

సీజేఐ భవనాన్ని వెంటనే ఖాళీ చేయించండి: SC అడ్మినిస్ట్రేషన్

image

సుప్రీంకోర్టు అడ్మినిస్ట్రేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలోని కృష్ణ మీనన్ మార్గ్‌లోని చీఫ్ జస్టిస్ బంగ్లాను వెంటనే ఖాళీ చేయించాలని కేంద్రాన్ని సూచించింది. ప్రస్తుతం అందులో మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్ నివాసం ఉంటున్నారు. CJIగా చంద్రచూడ్ 2022 NOV నుంచి 2024 NOV వరకు పనిచేశారు. నిబంధన ప్రకారం రిటైర్మెంట్ తర్వాత 6నెలల వరకే(మే 31) ఆయనకు బంగ్లాలో ఉండటానికి అనుమతి ఉందని గుర్తు చేసింది.

News July 6, 2025

HYD: త్వరలో వాట్సప్ బస్ టికెట్

image

గ్రేటర్ HYDలో త్వరలో వాట్సప్ టికెటింగ్, డిజిటల్ బస్ పాస్ అమల్లోకి తీసుకొస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇప్పటికే క్యూఆర్ కోడ్ RTC బస్ టికెట్ విధానం అందుబాటులో ఉంది. జస్ట్ QR కోడ్ స్కాన్ చేసి, ఫోన్లో పేమెంట్ చేస్తే టికెట్ వస్తుంది. ఇవన్నీ ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టంలో ఒక భాగం. ఈ సేవలను మరింత విస్తరిస్తామని తెలిపారు.

News July 6, 2025

HYDలో 1992 నాటి కూరగాయల మార్కెట్

image

HYD గుడిమల్కాపూర్ మార్కెట్ పక్కనే కూరగాయలు మార్కెట్ ఉంది. మెహదీపట్నం బస్టాండ్ కోసం గుడిమల్కాపూర్లో 6 ఎకరాల విస్తీర్ణంలో 1992లో నిర్మాణాలు చేపట్టారు. కానీ మద్యలో వ్యవసాయ మార్కెట్ కోసం దానిని అప్పగించారు. అప్పటి నుంచి 3 దశాబ్దాలుగా సాగుతుంది. ఇక్కడికి కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి సైతం కూరగాయలు వస్తుంటాయి.