News March 19, 2025

పోతురాజు కాలువ పనుల్లో అవినీతి: MLA దామచర్ల

image

ఒంగోలులో ఉన్న పోతురాజు కాలువ, నల్ల కాలువ సమస్యలపైన గతంలో పోతురాజు కాలువలో జరిగిన అవినీతిని, అసెంబ్లీలో MLA దామచర్ల జనార్దన్‌రావు ప్రశ్నించారు. మున్సిపల్ మంత్రి నారాయణ సమాధానం ఇస్తూ.. పోతురాజు కాలువ ఆధునీకరణలో అవినీతి జరిగిందని MLA సభ దృష్టికి దృష్టికి తెచ్చారని తెలిపారు. దీనిపై ఇరిగేషన్ శాఖ నుంచి పూర్తి సమాచారాన్ని తీసుకొని అవినీతి చేసిన బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News March 19, 2025

ప్రకాశం జిల్లా కలెక్టర్‌కు ‘స్కోచ్ అవార్డు’

image

ప్రకాశం జిల్లాలో బాల్య వివాహాలను నివారించి బంగారు బాల్యానికి బాటలు వేసేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిన కలెక్టర్ అన్సారియాకు జాతీయస్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన స్కోచ్ అవార్డు లభించింది. బాల్య వివాహాల నివారణకై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలను, స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేస్తూ ‘బంగారు బాల్యం’ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. త్వరలో ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అవార్డు అందుకుంటారు.

News March 19, 2025

క్రికెట్ పోటీల్లో గాయపడ్డ MLA విజయ్

image

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్రికెట్ పోటీలలో సంతనూతలపాడు ఎమ్మెల్యే BN విజయ్ కుమార్ మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా క్రింద పడిపోవడంతో గాయాలపాలయ్యారు. వెంటనే ఎమ్మెల్యేకు చికిత్స అందజేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 19, 2025

ఒంగోలు: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి

image

రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన, గుణాత్మక విద్య అందడమే లక్ష్యంతో పనిచేస్తున్నదని కలెక్టర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ విద్యా శాఖాధికారులతో సమావేశమై G.O 117, డ్రాప్ అవుట్స్ తదితర అంశాలపై సమీక్షించి, పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జీవో 117ను ఉపసంహరించిన తర్వాత ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చేందుకు అవసరమైన ప్రక్రియను విద్యాశాఖ ప్రారంభించిందన్నారు.

error: Content is protected !!