News March 19, 2025

హైదరాబాద్‌‌లో ముంచుకొస్తున్న ముప్పు!

image

HYD‌కు ముప్పు ముంచుకొస్తోంది. ఈ వేసవిలో నీటి కొరత ఏర్పడే పరిస్థితి ఉంది. భూగర్భ జలాలు క్రమంగా తగ్గుతున్నాయి. ORR వరకు 948 చ.కిమీ మేర ఏకంగా 921 చ. కిమీ మేర భూగర్భ జలాలు ఆందోళనకర స్థాయిలో ఉన్నట్లు జలమండలి నివేదికలో వెల్లడైంది. ప్రతిరోజు దాదాపు 11 వేల ట్యాంకర్లను నగరవాసులు బుక్ చేసుకుంటున్నారు. IT కారిడార్, కూకట్‌పల్లి, మాదాపూర్‌, శేరిలింగంపల్లి వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది.

Similar News

News January 2, 2026

వరంగల్ తూర్పులో పీక్స్‌కు చేరిన వైరం!

image

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అధికార పార్టీలో వర్గపోరు పీక్ స్థాయికి చేరింది. MLC, మాజీ MLCల వర్గాలు వీడిపోయాయి. గత రెండేళ్లలో వరంగల్ డివిజన్ పోలీసులు నమోదు చేసిన కేసులను తిరుగతోడుతున్నారు. కాంగ్రెస్‌కి చెందిన నాయకులపైనే బనాయించిన కేసులను మళ్లీ విచారణ చేయాలని, వాటిని నమోదు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ సీపీ సన్ ప్రీత్ సింగ్‌కు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య రాసిన లేఖ కలకలం రేపుతోంది.

News January 2, 2026

NLG: అభ్యర్థుల ఎంపికపై పార్టీల దృష్టి

image

రిజర్వేషన్లు-నామినేషన్లకు మధ్యలో సమయం ఉండే అవకాశం లేకపోవడంతో అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. వార్డులవారీగా అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. రిజర్వేషన్ అనుకూలించినా లేకపోయినా ముందు జాగ్రత్తగా ప్రతీవార్డుకు కులాల వారీగా అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు వార్డుల వారీగా ఆశావాహుల జాబితా రూపొందించే పనిలో పడ్డాయి

News January 2, 2026

పొలిటికల్‌గా అందుకే యాక్టీవ్ అయ్యా: పేర్ని నాని

image

యాక్టీవ్ పాలిటిక్స్ పై మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని క్లారిటీ ఇచ్చారు. రాజకీయాలకు రిటైర్మెంట్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని, 2029 ఎన్నికల్లో కూడా పోటీ చేయనని ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. 2024 ఎన్నికల తర్వాత జగన్ కష్టాల్లో ఉన్నందునే తాను యాక్టీవ్ అయ్యానన్నారు. రాముడికి ఉడతా సాయంగా జగన్‌కు తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆ ఇంటర్వ్యూలో పేర్ని చెప్పుకొచ్చారు.