News March 24, 2024
నంద్యాల MP బరిలో వైఎస్ షర్మిల?

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నంద్యాల నుంచి MPగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పార్లమెంట్ స్థానంలో బీసీ, మైనారిటీ ఓట్లు అత్యధికంగా ఉండడంతోపాటు అప్పటి కాంగ్రెస్ హాయంలో ఆమె తండ్రి దివంగత CM వైఎస్ రాజశేఖర రెడ్డికి భారీ మెజారిటీ అందించిన స్థానాల్లో నంద్యాల పార్లమెంట్ స్థానం ఒకటి. ఉమ్మడి జిల్లాలో అప్పటి కాంగ్రెస్ నేతలను ఆమె మళ్లీ పార్టీలోకి వచ్చేలా ప్రణాళికల సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
Similar News
News September 28, 2025
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

జిల్లాలో భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డా.ఏ.సిరి ఆదేశించారు. వాగులు, వంకల వద్ద రాకపోకలు నిలిపివేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. విద్యుత్ తీగలు, నీటి ప్రవాహం వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి మండలంలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయగా, జిల్లా కేంద్రంలోనూ కంట్రోల్ రూమ్ (08518-277305) పనిచేస్తోందని కలెక్టర్ తెలిపారు.
News September 27, 2025
ఆపదలో ఉంటే 112కు కాల్ చేయండి: కర్నూలు ఎస్పీ

ఆపదలు, అత్యవసర పరిస్థితులు, సమస్యలు, అసాంఘిక కార్యకలాపాలు ఏవైనా ప్రజల దృష్టికి వస్తే వెంటనే డయల్ 100, 112కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. ఫోన్ చేసిన వెంటనే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 15 నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలానికి బ్లూ కోల్ట్స్, రక్షక్, పోలీసులు చేరుకుంటారన్నారు. డయల్ 112 హెల్ప్ లైన్ నంబర్ కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానమై అందుబాటులో ఉంటుందన్నారు.
News September 27, 2025
అర్జీల పరిష్కారం సమాచారం కోసం ఫోన్ 1,100: కలెక్టర్

అర్జీల పరిష్కారం సమాచారం కోసం ఫోన్ 1,100కు సంప్రదించాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. జిల్లాలో అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవడం కోసం కాల్ సెంటర్ నంబర్ 1,100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే అర్జీదారులు. Meekosam.ap.gov.i వెబ్సైట్లో వారి అర్జీలు నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.