News March 19, 2025
సూర్యాపేట: ప్రజలు వెయిటింగ్.. బడ్జెట్ ఓకేనా!

అసెంబ్లీలో ప్రభుత్వం నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా దానిపై జిల్లా ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. సూర్యాపేటలో ఆటోనగర్‌లో IT కారిడార్ ఏర్పాటు, SRSP కాల్వలకు నిధులు, MG యూనివర్సిటీకి ఫండ్స్, తుంగతుర్తిలో డిగ్రీ కళాశాల, ఐటీఐ కళాశాలను ఏర్పాటు కోసం ఇక్కడి ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి కీలక శాఖలకు ఇద్దరు మంత్రులుగా ఉండడంతో బడ్జెట్ ఆశాజనకంగా ఉంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News July 5, 2025
మంత్రి సీతక్కపై వచ్చిన ప్రకటన మాది కాదు: మావోయిస్టు కమిటీ

ఆదివాసీల హక్కులను మంత్రి సీతక్క పట్టించుకోవడం లేదంటూ June 26న విడుదలైన ప్రకటనతో తమకు సంబంధం లేదని మావోయిస్టు TG కమిటీ స్పష్టం చేసింది. మావోయిస్టు దామోదర్ లొంగిపోతున్నట్లు వచ్చిన వార్తలూ అవాస్తవమని, పోలీసులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట ప్రకటన విడుదల చేసింది. మావోల సమాచారం కోసం MLG, భద్రాద్రి, ASF జిల్లాల్లో ఆదివాసీలను పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపించింది.
News July 5, 2025
40 ఏళ్ల వయసు.. IVFతో తల్లి కాబోతున్న నటి!

IVF ద్వారా తాను కవలలకు తల్లి కాబోతున్నట్లు కన్నడ నటి భావన రామన్న ఇన్‌స్టా వేదికగా ప్రకటించారు. ‘20, 30 ఏళ్ల వయసులో నాకు తల్లి కావాలనే కోరిక ఉండేది కాదు. 40 ఏళ్లకు వచ్చేసరికి ఆ కోరిక తీరడం కష్టమైపోయింది. చాలా IVF క్లినిక్‌లు తిరస్కరించాయి. నా తండ్రి, తోబుట్టువులు, ప్రియమైన వారు నాకు అండగా నిలిచారు. నా పిల్లలకు తండ్రి లేకపోవచ్చు. కానీ వారు గర్వపడేలా పెంచుతాను’ అని అవివాహితైన ఆమె రాసుకొచ్చారు.
News July 5, 2025
VJA: దుర్గమ్మ దర్శనానికి తరలివచ్చిన భక్తులు

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 10 వేల నుంచి 15 వేల మంది భక్తులు విచ్చేశారు. వందలాది బృందాలుగా వచ్చిన మహిళలు కనకదుర్గమ్మకు ఆషాఢ సారె సమర్పించారు. కాగా అమ్మవారికి కొందరు భక్తులు సమర్పించిన సారెలోని మిఠాయి రోలు, రోకలి, సన్నికల్లు, పంచదార చిలుకలను భక్తులు ఆసక్తిగా తిలకించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేసినట్లు EO శీనా నాయక్ చెప్పారు.