News March 19, 2025
అన్నమయ్య: పుట్టిన రోజే మృతి

పుట్టిన రోజు సరదాగా స్నేహితుడితో వెళ్లిన వారికి అదే చివరి రోజు అయింది. ఈ విషాద ఘటన అన్నమయ్య జిల్లా పీటీఎం మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అంబేడ్కర్ కాలనీకి చెందిన శ్రీనివాసులు(22)ది సోమవారం పుట్టినరోజు. తన స్నేహితుడు చందు(22)తో బి.కొత్తకోటలో సినిమా చూడటానికి వెళ్లారు. ఇంటికి వస్తున్న క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
Similar News
News March 19, 2025
టీచర్ల బదిలీల చట్టంతో చరిత్ర సృష్టించబోతున్నాం: లోకేశ్

AP: ఏపీ ఉపాధ్యాయ బదిలీల క్రమబద్ధీకరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ బదిలీల చట్టం ఒక చరిత్రాత్మక నిర్ణయం అన్నారు. ‘YCP ప్రభుత్వంలో అడ్డగోలుగా బదిలీలు జరిగాయి. అందరితో చర్చించాకే టీచర్ల బదిలీల చట్టం తీసుకొచ్చాం. పారదర్శకంగా ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా ఉంటుంది. టీచర్ల బదిలీల చట్టం ద్వారా మా ప్రభుత్వం చరిత్ర సృష్టించబోతోంది’ అని లోకేశ్ అన్నారు.
News March 19, 2025
బడ్జెట్‌లో పేజీలే పెరిగాయి.. సంక్షేమం కాదు: హరీశ్ రావు

TG: మహిళలను ప్రభుత్వం మోసం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ‘బడ్జెట్‌లో అబద్ధాలు, అతిశయోక్తులే ఉన్నాయి. మహిళలకు రూ.5లక్షలు మాత్రమే వడ్డీలేని రుణం ఇస్తున్నారు. బడ్జెట్‌లో మాత్రం రూ.లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు ఇస్తున్నామన్నారు. బడ్జెట్ పేజీలు పెరిగాయి తప్ప పేదలకు సంక్షేమం పెరగలేదు. మహిళలకు రూ.2,500 హామీ ఊసే లేదు. కానీ అందాల పోటీలకు రూ.250 కోట్లు బడ్జెట్‌లో పెట్టారు’ అని విమర్శించారు.
News March 19, 2025
IPL: కోహ్లీ బ్యాటింగ్.. సహచరుడు అంపైరింగ్

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చిన్ననాటి సహచరుడు తన్మయ్ శ్రీవాస్తవ IPLలో అంపైరింగ్ చేయనున్నారు. వీరిద్దరూ కలిసి 2008 అండర్-19 వరల్డ్ కప్‌లో ఆడారు. ఆ టోర్నీ ఫైనల్లో శ్రీవాస్తవ (46) టాప్ స్కోరర్. ఆయన IPL (PBKS తరఫున) కూడా ఆడారు. శ్రీవాస్తవ క్రికెట్‌కు రిటైర్మెంట్ పలికి అంపైరింగ్ చేస్తున్నా కోహ్లీ ఇంకా క్రికెటర్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం కోహ్లీ కెరీర్ పీక్స్‌లో ఉన్న విషయం తెలిసిందే.