News March 19, 2025

నిర్మల్: టిప్పర్ కిందపడి ఒకరి దుర్మరణం

image

జిల్లా కేంద్రంలోని గండి రామన్న ఆలయం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్ఆర్ కాలనీకి చెందిన జవాన్ కరణ్ సింగ్(22) యువకుడు మృతి చెందినట్లు రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఇద్దరు మిత్రులతో కలిసి చించోలి వెళ్లి తిరిగి వస్తుండగా ఆలయం వద్ద ముందు వెళ్తున్న టిప్పర్‌ను ఓవర్ టేక్ చేసి కిందపడ్డారు. దీంతో కరణ్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా ఇద్దరు చికిత్స పొందుతున్నారు.

Similar News

News July 7, 2025

గుంటూరు మిర్చి యార్డులో నేటి ధరలివే.!

image

గుంటూరు మిరప మార్కెట్‌లో సోమవారం 20 వేల బస్తాలు అమ్మకానికి వచ్చాయి. ఏ/సీ సరుకు సంఖ్య 60 వేలుగా నమోదైంది. తాజా ధరల ప్రకారం తేజా ఏ/సి రూ.120-132, 355 ఏ/సి రూ.100-125, 2043 ఏ/సి రూ.120-130, 341 ఏ/సి రూ.120-135, నంబర్ 5 ఏ/సి రూ.125-135 ఉండగా, సీజెంటా, డీడీ, రోమి-26, బంగారం రకాల ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. నాటు 334, సూపర్ టెన్ రకాలు రూ.80-130 వరకు ఉన్నాయి. తాలుకూ ధరలు రూ.35-70 మధ్య ఉన్నాయి.

News July 7, 2025

జిల్లాలో ఎరువులు కొరత లేదు: జిల్లా వ్యవసాయ అధికారి

image

తూర్పుగోదావరి జిల్లాలో ఎటువంటి ఎరువుల కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.మాధవ రావు సోమవారం తెలిపారు. జిల్లాలో గత ఏప్రిల్ నెల నుంచి ఇప్పటివరకు 35,869 టన్నుల వేర్వేరు రకాల ఎరువులను ప్రైవేటు డీలర్లు, మార్క్ ఫెడ్ ద్వారా రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. ఇందులో యూరియా 15,294 టన్నులు, డీఏపీ 2,615 టన్నులు, పొటాష్ 2,918 టన్నులు, సూపర్ 6,324 టన్నులు ఉన్నాయన్నారు.

News July 7, 2025

రంప : 9000మంది విద్యార్థులకు కాస్మెటిక్ కిట్స్

image

రంపచోడవరం, చింతూరు డివిజన్‌లో 21 గురుకుల పాఠశాలలు, కళాశాలలు, ఏకలవ్య పాఠశాలల విద్యార్థులకు కాస్మెటిక్ కిట్స్‌ను ప్రభుత్వం మంజూరు చేసిందని ITDA. PO. సింహాచలం సోమవారం ప్రకటనలో తెలిపారు. దాదాపు 9 వేల మంది బాల, బాలికలకు వీటిని అందజేస్తామన్నారు. డిటర్జెంట్ సోప్స్, పౌడర్, బాత్ సోప్స్, షాంపు పాకెట్స్, కోకోనట్ ఆయిల్, వేజలైన్, టూత్ పేస్ట్, బ్రష్ తదితర వస్తువులు ఉంటాయని తెలిపారు.