News March 19, 2025

ASF: యాక్సిడెంట్.. ఒకరి దుర్మరణం

image

ఉట్నూర్ మండలం ఘన్పూర్ ఎక్స్ రోడ్డు వద్ద మంగళవారం రెండు బైకులు ఢీకొన్నాయని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ జైనూర్ మండలం గూడ మామడ గ్రామానికి చెందిన కుమ్రా భక్కు‌ను రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. గౌరు అనే మరోవ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎదురుగా బైక్‌ను ఢీ కొన్న చిచ్‌దరి ఖానాపూర్‌కు చెందిన వ్యక్తికి గాయాలతో చికిత్స పొందుతున్నాడన్నారు.

Similar News

News November 9, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 09, ఆదివారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.04 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.18 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.06 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.42 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 9, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 9, 2025

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆర్పీఎస్ అభ్యర్థులు: నాగరాజు

image

రాష్ట్రంలో జరిగే ప్రతి ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో రిజర్వేషన్ల పరిరక్షణ సమితి (ఆర్పీఎస్) అభ్యర్థులు పోటీ చేస్తారని ఆర్పీఎస్ వ్యవస్థాపకుడు డా.పోతుల నాగరాజు తెలిపారు. శనివారం ఆయన అనంతపురంలోని ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. ఎమ్మెల్సీలను నమ్మి ఓటు వేసిన గ్రాడ్యుయేట్, ఉద్యోగ, ఉపాధ్యాయ ఓటర్లను మోసం చేస్తున్నందునే వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆర్పీఎస్ పోటీ చేస్తుందన్నారు.