News March 19, 2025

పెనుగంచిప్రోలు ఘటనలో 9 మందిపై కేసు నమోదు

image

పెనుగంచిప్రోలులో మంగళవారం జరిగిన రాళ్ల దాడి ఘటనకు సంబంధించి 9 మందిపై కేసు నమోదు చేసినట్లు జగ్గయ్యపేట సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ ఏసోబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గానికి చెందిన వెంకటేశ్వరరావు, గోపి, మణికంఠ, నాగబాబు, సుదీర్, వేల్పుల అజయ్, యాదగిరి, శ్రీహరి, వెంకటేశ్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పలువురిని అదుపులోకి తీసుకున్నామన్నారు.

Similar News

News November 5, 2025

పల్నాడు: నవంబర్ 25లోగా ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆహ్వానం

image

జిల్లాలో దివ్యాంగులకు మూడు చక్రల మోటార్ వాహనాలు మంజూరుకు ఆన్‌లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తునట్లు దివ్యాంగుల శాఖ సహాయ సంచాలకులు డి. దుర్గాభాయి తెలిపారు. 70% అంగవైకల్యంతో డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న దివ్యాంగులు అర్హులని చెప్పారు. రెగ్యులర్ గ్రాడ్యుయేషన్, కనీసం 10 పాసై ఉండాలన్నారు.18 నుంచి 45 ఏళ్ల వయసులోపు .https://www.apdascac.ap.gov.in వెబ్‌సైట్లో నవంబర్ 25 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News November 5, 2025

మన్యం కేఫ్ పరిశీలించిన DRDA పీడీ

image

పార్వతీపురం ఐటీడీఏ పెట్రోల్ బంక్ ఆవరణలో DRDA ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మన్యం కేఫ్‌ను DRDA పీడీ ఎం.సుధారాణి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అమ్మకాలను పరిశీలించారు. మన్యం జిల్లా మహిళా సంఘాల సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులను ఈ కేఫ్ ద్వారా అమ్మకాలు చేపడుతున్నామని, ప్రజలు ఈ ఉత్పత్తులు కొనుగోలు చేసి సహకరించాలని కోరారు.

News November 5, 2025

HYD: కార్తీకపౌర్ణమి.. ఫేమస్ శివాలయాలు ఇవే!

image

కార్తీక పౌర్ణమి సందర్భంగా HYD-ఉమ్మడి రంగారెడ్డిలోని ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. కీసరగుట్టతో పాటు సిటీ శివారులో ప్రఖ్యాతి, అతి పురాతన ఆలయాలు ఉన్నాయి. ఆరుట్ల-బుగ్గ రామలింగేశ్వర స్వామి, యాచారం-నందీశ్వర, శంషాబాద్-సిద్ధేశ్వరాలయం, శంకర్‌పల్లి-మరకత శివలింగం, పాంబండ-రామలింగేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి. పాంబండ దక్షిణాసియాలోనే అతిపెద్ద ఏకశిలా పర్వతంపైన ఉన్న ఆలయం. మీ ఏరియాలోని శివాలయం విశిష్టత ఏంటి?
SHARE IT