News March 19, 2025

జిల్లాలోనే ప్రథమ స్థానం కోట్‌పల్లి ప్రథమ స్థానం 

image

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 20మండలాల పరిధిలో 100% ఇంటి పన్ను వసూలు చేసి జిల్లాలోనే కోట్‌పల్లి మండలం ప్రథమ స్థానంలో నిలిచింది. మండల వ్యాప్తంగా మొత్తం 18 గ్రామ పంచాయతీలకు గాను 18 గ్రామ పంచాయతీలో 100% ఇంటి పన్ను వసూలు చేసి పంచాయతీ అధికారులు సక్సెస్ సాధించారు. 2వవ స్థానంలో వికారాబాద్ 96%, మూడవ స్థానంలో బంట్వారం, ధరూర్ 94%, తాండూరు మండలం 74% చివరి స్థానంలో ఉంది.

Similar News

News March 19, 2025

నారాయణపేట: ఆ విద్యార్థులకు FREEగా శిక్షణ

image

ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం భవిత సెంటర్లలో ప్రత్యేక శిక్షణను ఫ్రీగా ఇస్తున్నట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. నారాయణపేటలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో బుధవారం భారత కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపకరణాలను పంపిణీ చేశారు. భవిత సెంటర్‌లో దివ్యాంగులకు ఇచ్చే శిక్షణను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అధికారులు పాల్గొన్నారు.

News March 19, 2025

నరసరావుపేట: లాడ్జిలో యువకుడి బలవన్మరణం

image

నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న లాడ్జిలో ఉరివేసుకొని హనుమంతరావు (30) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మృతుడు బాపట్ల జిల్లా బల్లికురవ (మ) గుడిపాడు గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తించారు. నరసరావుపేట మండలంలోని పమిడిమర్రు గ్రామానికి చెందిన యువతిని 4 నెలల క్రితం హనుమంతరావు వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన 4 నెలలకే చనిపోవడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

News March 19, 2025

MNCL: పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలి: CP

image

రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్‌లో బుధవారం దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. సీపీ అంబర్ కిషోర్ ఝా హాజరై ఏఆర్ పోలీస్ అధికారులు, సిబ్బందితో మాట్లాడి సమస్యలు తెలుసుకొన్నారు. వాటిని వెంటనే పరిష్కరించేలా చూస్తామన్నారు. అందరూ సమన్వయంతో క్రమశిక్షణ, ప్రణాళికాబద్ధంగా విధులు నిర్వర్తించాలని కోరారు. కమిషనరేట్, తెలంగాణ పోలీసులకు మంచిపేరు తీసుకురావాలని సూచించారు.

error: Content is protected !!