News March 19, 2025
సంగారెడ్డి యువతకు GOOD NEWS

రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో సంగారెడ్డి జిల్లాలోని SC, ST, BC, మైనార్టీ నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. జిల్లాలో 7.20 లక్షల మంది యువత ఉన్నారు. ఏప్రిల్ 5 వరకు http:///tgobmmsnew.cgg.gov.in లో అప్లై చేసుకుంటే జూన్ 2 అర్హుల తుది జాబితా ప్రకటిస్తారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలను త్వరలో వెల్లడించనున్నారు. ఎంచుకునే యూనిట్‌ని బట్టి రూ.3 లక్షల వరకు ఇవ్వనున్నారు.
Similar News
News March 19, 2025
నారాయణపేట: ఆ విద్యార్థులకు FREEగా శిక్షణ

ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం భవిత సెంటర్లలో ప్రత్యేక శిక్షణను ఫ్రీగా ఇస్తున్నట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. నారాయణపేటలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో బుధవారం భారత కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపకరణాలను పంపిణీ చేశారు. భవిత సెంటర్‌లో దివ్యాంగులకు ఇచ్చే శిక్షణను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అధికారులు పాల్గొన్నారు.
News March 19, 2025
నరసరావుపేట: లాడ్జిలో యువకుడి బలవన్మరణం

నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న లాడ్జిలో ఉరివేసుకొని హనుమంతరావు (30) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మృతుడు బాపట్ల జిల్లా బల్లికురవ (మ) గుడిపాడు గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తించారు. నరసరావుపేట మండలంలోని పమిడిమర్రు గ్రామానికి చెందిన యువతిని 4 నెలల క్రితం హనుమంతరావు వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన 4 నెలలకే చనిపోవడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
News March 19, 2025
MNCL: పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలి: CP

రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్‌లో బుధవారం దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. సీపీ అంబర్ కిషోర్ ఝా హాజరై ఏఆర్ పోలీస్ అధికారులు, సిబ్బందితో మాట్లాడి సమస్యలు తెలుసుకొన్నారు. వాటిని వెంటనే పరిష్కరించేలా చూస్తామన్నారు. అందరూ సమన్వయంతో క్రమశిక్షణ, ప్రణాళికాబద్ధంగా విధులు నిర్వర్తించాలని కోరారు. కమిషనరేట్, తెలంగాణ పోలీసులకు మంచిపేరు తీసుకురావాలని సూచించారు.