News March 19, 2025

రాజన్న సిరిసిల్ల: బడ్జెట్‌పైనే భారమంతా..!

image

రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై ఉమ్మడి KNR జిల్లా ప్రజలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. బడ్జెట్‌లో జిల్లాలోని వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, ఓదెల, కాళేశ్వరం, ఇల్లందకుంట ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు. జమ్మికుంట బస్సు డిపో ఏర్పాటు, కల్వల రిజర్వాయర్‌కు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉమ్మడి KNR జిల్లాకు ఇంకేం కావాలో కామెంట్ చేయండి.

Similar News

News November 1, 2025

ఇతిహాసాలు క్విజ్ – 53 సమాధానాలు

image

1. జ్యోతిర్లింగం మొదలు, తుది తెలుసుకోలేని దేవతలు ‘బ్రహ్మ, విష్ణువు’.
2. తారకాసురుని సంహరించింది ‘కార్తికేయ స్వామి’.
3. దక్ష యజ్ఞాన్ని నాశనం చేసిన శివుడి ఉగ్ర రూపం పేరు ‘వీరభద్ర’.
4. శ్రీకృష్ణుడికి బాణం వేసిన వేటగాడి ‘జరా’.
5. పంచభూత స్థలాల్లో భూమి (పృథ్వీ) లింగం ‘కాంచీపురంలోని ఏకాంబరేశ్వర ఆలయం’లో ఉంది.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 1, 2025

ప.గో: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి

image

నల్లజర్ల మండలం దూబచర్ల విద్యా శిక్షణ సంస్థలో 4 సీనియర్ లెక్చరర్స్, 9 లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రిన్సిపల్ కమల కుమారి శనివారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఉమ్మడి ప.గో జిల్లాలోని అన్ని ప్రభుత్వ స్కూల్స్ లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు LEAP App లో దరఖాస్తు చేయాలన్నారు. మరిన్ని వివరాలకు www.deoeluru.org వెబ్సైట్ పరిశీలించాలన్నారు. నవంబర్ 3 తో దరఖాస్తు గడువు ముగుస్తుందన్నారు.

News November 1, 2025

కొత్తగూడెం: ఈవీఎం గోడౌన్ తనిఖీ చేసిన కలెక్టర్

image

ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ జితేష్ వి పాటిల్ శనివారం తనిఖీ చేశారు. ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈవీఎం భద్రతకు సంబంధించి ప్రతినెల తనిఖీ చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ పరిశీలనలో భాగంగా సీసీ కెమెరా గదిలో కెమెరాల పనితీరును పరిశీలించారు. గోడౌన్ పరిసర ప్రాంతంలో పరిశుభ్రంగా ఉంచాలని, అనుమతి లేనిదే ఎవరిని లోపలికి రానివ్వకూడదని అధికారులకు సూచించారు. అనంతరం తనిఖీ రిజిస్టర్లో సంతకం చేశారు.