News March 19, 2025
నంద్యాల జిల్లాలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

నంద్యాల జిల్లాలో మంగళవారం రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా బండి ఆత్మకూరు, పెద్ద దేవళాపురంలో 42.7°C, చాగలమర్రిలో 42.4°C ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి. గోస్పాడు 41.9°, దొర్నిపాడు 41.7° ఆత్మకూరు 41.5°, కొత్తపల్లి 41.4°, పగడ్యాల మండలాల్లో 41.1° ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News March 19, 2025
పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ

చిత్తూరు నగరంలోని మున్సిపల్ హైస్కూల్‌లో జరుగుతున్న పదవ తరగతి పరీక్షలను జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు బుధవారం పరిశీలించారు. చిత్తూరు జిల్లా అంతట పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి అవసరమైన అన్ని రకాల భద్రత చర్యలను ఏర్పాటు చేశామన్నారు.
News March 19, 2025
సిద్దిపేట: పరీక్షా కేంద్రాల వద్ద BNSS 163 సెక్షన్ అమలు

సిద్దిపేట జిల్లాలో పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న 79 కేంద్రాల వద్ద 163 BNSS-2023 సెక్షన్ అమలు చేస్తున్నట్లు సీపీ డాక్టర్ బి. అనురాధ తెలిపారు. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 4 వరకు జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సిద్దిపేట్ జిల్లాలోని పరీక్ష కేంద్రాల వద్ద ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. ఎగ్జామ్స్ సెంటర్ సమీపంలోని అన్ని జిరాక్స్ సెంటర్స్ మూసి వేయాలని సూచించారు.
News March 19, 2025
రేవంత్‌పై నమోదైన కేసు కొట్టివేత

TG: గత ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డిపై నమోదైన కేసును హైకోర్టు తాజాగా కొట్టివేసింది. 2020 మార్చిలో జన్వాడలో డ్రోన్ ఎగురవేశారని రేవంత్‌తో సహా పలువురిపై రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి పీఎస్‌లో కేసు నమోదైంది. అలాగే రేవంత్‌ను కించపరిచే విధంగా మాట్లాడారని సైఫాబాద్ పీఎస్‌లో కేటీఆర్‌పై నమోదైన కేసును కూడా హైకోర్టు కొట్టివేసింది.