News March 19, 2025
ములుగు: అటవీ అధికారి తీరుకు ఏడుగురు బలి!

ములుగు జిల్లాలో ఓ అటవీ శాఖ అధికారి తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏటూరునాగారంలో పని చేసిన ఓ రేంజర్ తునికాకు బోనస్ డబ్బులు కింది స్థాయి సిబ్బంది ఖాతాల్లో వేయించి, డ్రా చేయించాడు. ఈ విషయంలో స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఖాతాలో వేయించిన ఏడుగురిపై కేసు నమోదు కాగా, రేంజర్‌పై కేసు నమోదు కాలేదు. దీంతో కింది స్థాయి సిబ్బంది జైలుకు పోవాల్సిన దుస్థితి నెలకొందని వాపోతున్నారు.
Similar News
News September 15, 2025
శ్రీకాకుళం-విశాఖకు ఈ రైళ్లు నడవనున్నాయి

శ్రీకాకుళం జిల్లా వాసులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. విశాఖ-బ్రహ్మపూర్-విశాఖపట్నం(18525/26) రైలును ఇటీవల రద్దు చేసిన విషయం తెలిసిందే. మరలా సేవలను పునరుద్ధరించినట్లు తాజాగా వెల్లడించింది. పలాస-విశాఖ(67290) మెము రైలును విశాఖ వరకు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇవి శ్రీకాకుళం రోడ్డు, పొందూరు, నౌపడ, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం తదితర స్టేషన్లు మీదుగా నడవనున్నాయి.
News September 15, 2025
విశాఖలో ‘స్వస్త్ నారి-సశక్త్ పరివార్’ అభియాన్

విశాఖ జిల్లాలో మహిళల ఆరోగ్యం కోసం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు “స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్” ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ జగదీశ్వరరావు తెలిపారు. ఆరోగ్య కేంద్రాల్లో గుండెజబ్బులు, మధుమేహం, క్యాన్సర్, గర్భిణుల పరీక్షలు, పిల్లలకు టీకాలు వేస్తారన్నారు. సెప్టెంబర్ 17న ప్రధాని వర్చువల్‌గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News September 15, 2025
లిక్కర్ స్కాం: మరో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన సిట్

మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ ఇవాళ మరో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడు, బాలాజీకుమార్ యాదవ్, నవీన్ కృష్ణ ప్రమేయంపై వివరాలు పొందుపరిచినట్లు తెలుస్తోంది. తాజాగా దాఖలు చేసిన రెండో అనుబంధ అభియోగపత్రంతో కలిపి ఇప్పటి వరకు సిట్ మొత్తం మూడు ఛార్జ్‌షీట్లు దాఖలు చేసినట్లయింది.