News March 19, 2025
సిద్దిపేట: భట్టి బడ్జెట్‌పై బోలేడు ఆశలు..!

నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై జిల్లా ప్రజలు బోలేడు ఆశలు పెట్టుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగమైన మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయకసాగర్, గౌరవెల్లి ప్రాజెక్టుల కాల్వల నిర్మాణం, భూనిర్వాసితులకు పరిహారం నిధుల కేటాయింపుపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. చేర్యాల, దుబ్బాక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, జిల్లాలో కొత్తగా చేపట్టే ప్రాజెక్టుల కోసం ఎదురుచూస్తున్నారు.
Similar News
News January 12, 2026
మేడారంలో భద్రతను పటిష్ఠం చేయండి: మంత్రి సీతక్క

ఈనెల 28 నుంచి నాలుగు రోజులపాటు జరిగే మేడారం జాతరలో భక్తులకు పటిష్ఠమైన భద్రత కల్పించాలని మంత్రి సీతక్క రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డిని కోరారు. గిరిజన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, జారే ఆదినారాయణతో కలిసి డీజీపీని కలిసిన సీతక్క మేడారం ఆహ్వాన పత్రికను అందజేశారు. సత్తుపల్లి ట్రైబల్ పోలీస్ బెటాలియన్ సమస్యలను డీజీపీ దృష్టికి తీసుకొచ్చారు. రిక్రూట్‌మెంట్, ప్రమోషన్లు, బదిలీలపై చర్చించారు.
News January 12, 2026
NZB: 2025లో రోడ్డు ప్రమాదాల్లో 280 మృతి

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన రోడ్డు భద్రతా మాసోత్సవ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 2024లో 856 ప్రమాదాలు జరిగి 351 మంది మరణించగా, 2025 నవంబరు నాటికి 815 దుర్ఘటనల్లో 280 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. మరణాల సంఖ్య తగ్గించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేసి, నిబంధనలపై ప్రజలను చైతన్యపరచాలని ఆదేశించారు.
News January 12, 2026
BANలో హిందూ సింగర్ మృతి.. జైలు అధికారులపై ఆరోపణలు

బంగ్లాదేశ్‌లో హిందూ సింగర్, అవామీ లీగ్ నేత ప్రోలోయ్ చాకీ(60) కన్నుమూశారు. 2024లో జరిగిన ఓ పేలుడు కేసులో ఆయన్ను గత నెల 16న పోలీసులు అరెస్ట్ చేశారు. జైలు కస్టడీలో ఉన్న ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఇప్పటికే డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యలు ఉండటంతో ఆరోగ్యం క్షీణించింది. ఆస్పత్రికి తరలించగా నిన్న రాత్రి చనిపోయారు. అయితే చికిత్స అందించడంలో జైలు అధికారులు ఆలస్యం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.


