News March 19, 2025
కొండగట్టులో పలు వ్యాపారాలకు టెండర్లు

ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో మంగళవారం పలు వ్యాపారాలకు అధికారులు ఈ-టెండర్, సీల్డ్ టెండర్, బహిరంగ వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా 11 షాపులకు గాను అధిక పాటదారులు దక్కించుకున్నారు. అలాగే కొబ్బరి ముక్కలు ప్రోగు చేసుకునే హక్కునకు,, కొండగట్టు దిగువ ప్రాంతంలోని 2 షాపులకు గాను సరైన పాట రానందున వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News November 10, 2025
నల్గొండ: తగ్గిన ఉష్ణోగ్రతలు.. చలి షురూ

ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఈనెల మొదటి వారం నుంచి టెంపరేచర్ తగ్గి చలి పెరుగుతుండడంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి చల్లటి గాలులు వీస్తున్నాయని పలువురు చెబుతున్నారు. ఫిబ్రవరి రెండో వారం వరకు చలి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే వాతావరణ శాఖ చలిగాలులకు సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం నల్గొండలో ఉష్ణోగ్రత 20 డిగ్రీలుగా నమోదైంది.
News November 10, 2025
జడ్చర్ల: సైబర్ వల.. యువకుడు విలవిల

సైబర్ నేరగాళ్లు కొత్త తరహ మోసాలకు తెర తీస్తున్నారు. జడ్చర్లకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఏకంగా రూ.3.50 లక్షలు పోగొట్టుకున్నాడు. జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ మహిళ గర్భవతిని చేస్తే రూ.15 లక్షలు ఇస్తానని యువకుడిని నమ్మించింది. దీనికి అగ్రిమెంట్ చేసుకోవాలని చెప్పింది. అకౌంట్‌లో రూ.3.50 లక్షలు వేసుకోగా ఫోన్‌కు లింక్ క్లిక్ చేయగా డబ్బు మాయమైంది. ఆమెకు కాల్ చేయగా స్విచ్ఛాప్ వచ్చింది. పోలీసులను ఆశ్రయించాడు.
News November 10, 2025
పెద్దపల్లి: ‘35 ఏళ్ల పాటు దిగుబడి ఇస్తుంది’

వరిపంటలో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులకు పామ్ ఆయిల్ పంట లాభదాయకమని పెద్దపల్లి వ్యవసాయ శాఖ సూచించింది. తక్కువ శ్రమతో, అధిక లాభాలను అందించే ఈ పంట 35ఏళ్లపాటు దిగుబడి ఇస్తుందని అధికారులు తెలిపారు. ‘టన్నుకి రూ.19,000- 21,000 వరకు ధర లభిస్తోంది. మొక్కలు, డ్రిప్ ఇరిగేషన్‌పై ప్రభుత్వం 90% సబ్సిడీ ఇస్తుంది. రైతులు ఈ యాసంగి సీజన్‌లో పామ్ ఆయిల్ సాగు ప్రారంభించి, ఆర్థికంగా బలపడాలి’ అని అధికారులు పిలుపునిచ్చారు.


