News March 19, 2025
మంచిర్యాల: తల్లిదండ్రులు మందలించారని సూసైడ్

తల్లిదండ్రులు మందలించడంతో యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. SI వివరాలు.. MNCL జిల్లా శివ్వారంకి చెందిన రాకేశ్(26) ప్రైవేట్ కంపెనీలో పని చేసి మానేసి ఇంట్లోనే ఉంటున్నాడు. తల్లిదండ్రులు పని చేసుకోవాలని, పొలం పనులైనా చేయమని చెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన రాకేశ్ పొలం వద్ద ఉరేసుకున్నాడు. మంగళవారం గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 19, 2025
బ్యాంకర్లతో సమీక్షించిన MHBD జిల్లా కలెక్టర్

మహబూబాబాద్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాస్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ త్రైమాసిక సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొని మాట్లాడుతూ.. రుణాల పంపిణీలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని తెలిపారు. పంట రుణాల పంపిణీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి కేటాయించిన లక్ష్యాలు అడిగి తెలుసుకున్నారు.
News March 19, 2025
అలంపూర్: బీఆర్ఎస్ పార్టీ కొత్త కార్యాలయం ప్రారంభం

అలంపూర్ పట్టణంలో ఈరోజు బ్రాహ్మణ వీధి నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం దగ్గర బీఆర్ఎస్ కొత్త కార్యాలయం ప్రారంభించినట్లు అలంపూర్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వెంకటరామయ్య శెట్టి తెలిపారు. గతంలో న్యూ ప్లాట్స్ కాలనీలో ఉండేదని అక్కడి నుంచి అలంపూర్ పట్టణానికి తరలించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు చిలుకూరి శ్రీనివాసులు, సింగిల్ విండో డైరెక్టర్ రమేశ్ గుప్తా తదితరులు ఉన్నారు.
News March 19, 2025
ట్యాక్స్ వసూళ్లలో జమ్మికుంటకు మొదటి స్థానం

ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లలో జమ్మికుంట మున్సిపాలిటీ 100% లక్ష్యాన్ని సాధించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ అయాజ్ మాట్లాడుతూ.. ఈ ఘనత ప్రజల సహకారంతోనే సాధ్యమైందని.. అధికారులు, సిబ్బంది ముందుగా కార్యచరణ రూపొందించుకొని సమర్థవంతంగా పనిచేయడంతోనే ఈ లక్ష్యాన్ని సాధించామన్నారు. జమ్మికుంట మున్సిపాలిటీ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు.