News March 19, 2025

దిల్‌సుఖ్‌నగర్‌లో వ్యభిచారం.. నాగమణి దొరికిందిలా! (UPDATE)

image

దిల్‌సుఖ్‌నగర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న నాగమణిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. డెకాయ్ ఆపరేషన్ చేసి నిందితురాలిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ‘హలో నాగమణి’ అంటూ వాట్సాప్‌లో విటుల వలే మెసేజ్ చేయడంతో ఆమె దిల్‌సుఖ్‌నగర్‌కు అమ్మాయిని తీసుకొచ్చింది. ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమీర్‌పేట వాసి నాగమణి సినిమా అవకాశం అంటూ యువతులను వ్యభిచారంలోకి దింపుతున్నట్లు తేల్చారు

Similar News

News November 2, 2025

వరంగల్: హైదరాబాద్ బయలుదేరిన బీసీ సంఘం నేతలు

image

హైదరాబాద్‌లో జరగనున్న బీసీ జేఏసీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనడానికి వరంగల్ జిల్లాలోని బీసీ జేఏసీ, బీసీ సంక్షేమ సంఘం నాయకులు బయలుదేరారు. వరంగల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, బీసీ జేఏసీ ఛైర్మన్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ.. బీసీ హక్కుల సాధన కోసం రాష్ట్ర స్థాయిలో ఐక్యత అత్యవసరమన్నారు. ఈ సమావేశం చారిత్రాత్మకంగా నిలవబోతుందని పేర్కొన్నారు.

News November 2, 2025

నూజివీడు రెవిన్యూ డివిజన్.. అటా..ఇటా..?

image

జిల్లాల విభజనతో ఏలూరు జిల్లాలో చేరిన నూజివీడు రెవిన్యూ డివిజన్‌లో మార్పులు జరిగే అవకాశముంది. ఎన్నికల వేళ చంద్రబాబు నూజివీడును కృష్ణా జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారు. నూజివీడు ప్రాంతం విజయవాడను ఆనుకుని ఉందని, తమ ప్రాంతాన్ని ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. నూజివీడును కృష్ణా లేదా ఎన్టీఆర్ జిల్లాలో చేర్చే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

News November 2, 2025

కల్వకుర్తిలో పెరిగిన ఉష్ణోగ్రతలు

image

గడిచిన 24 గంటల్లో జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగాయి. అత్యధికంగా కల్వకుర్తిలో 32.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వెల్టూర్లో 32.4 డీగ్రీలు, తోటపల్లి, ఎల్లికల్, ఉర్కొండలో 32.3 డిగ్రీలు, వెల్దండలో 32.4 డిగ్రీలు, అచ్చంపేటలో 31.6 డిగ్రీలు, పెద్దూర్లో 31.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలో వర్షపాతం నమోదు కాలేదు.