News March 19, 2025
కర్నూలు: లంచం కోసం ఎస్ఐ అరాచకం.. మంగళసూత్రం తాకట్టు పెట్టించి..!

ఆస్పరి SI వెంకట నరసింహులు సస్పెన్షన్‌కు గురయ్యారు. చిత్తూరు జిల్లా సోమల పీఎస్‌లో పనిచేస్తున్న సమయంలో ఓ మహిళ నుంచి లంచం తీసుకున్న ఘటనలో సస్పెండ్ చేశారు. 2023లో ఓ మహిళ అదృశ్యమవ్వడంతో భర్త ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు ఆమె స్టేషన్‌కు చేరుకుని తన భర్తతో కలిసి ఉంటానని చెప్పింది. అందుకు ఎస్ఐ రూ.లక్ష డిమాండ్ చేసి, మంగళ సూత్రాన్ని తాకట్టు పెట్టించాడు. దీనిపై విచారణ జరిపిన అధికారులు ఆయనను సస్పెండ్ చేశారు.
Similar News
News January 21, 2026
‘విజిబుల్ పోలీసింగ్’ బలోపేతం: ఎస్పీ విక్రాంత్ పాటిల్

కర్నూలు జిల్లాలో ప్రజల భద్రత కోసం విజిబుల్ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అధికారులను ఆదేశించారు. నేరాల నియంత్రణలో భాగంగా వాహనాల తనిఖీలు, సైబర్ నేరాలపై అవగాహన సదస్సులు, రహదారి భద్రత నిబంధనల అమలును ముమ్మరం చేయాలని సూచించారు. ఏదైనా భద్రతా పరమైన సమస్యలు తలెత్తితే ప్రజలు వెంటనే డయల్ 112 లేదా 100కు సమాచారం అందించి పోలీసుల సహకారం తీసుకోవాలని ఎస్పీ పేర్కొన్నారు.
News January 21, 2026
కర్నూలు: ఊ అంటుందా. ఊఊ అంటుందా?

ఆదోని జిల్లా కోసం పట్టణంలో భారీగా నిరసనలు, నిరాహార దీక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. పశ్చిమ ప్రాంత నియోజకవర్గాలైన పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం, ఆదోని, ఎమ్మిగనూరులో ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా లేకపోవడంతో ఈనెల 24న ఆ 5 నియోజకవర్గాల్లో బంద్‌కు జేఏసీ పిలుపునిచ్చింది. ఈ బంద్ తర్వాతైనా ప్రభుత్వం ప్రత్యేక జిల్లాకు ఊ కొడుతుందా లేక ఊఊ అంటుందా చూడాలి.
News January 21, 2026
కర్నూలు: ఎయిడెడ్ పోస్టుల భర్తీకి పరీక్షా షెడ్యూల్ విడుదల

కర్నూలు జిల్లాలోని ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి డీఈవో సుధాకర్ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. దుపాడులోని డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి విద్యాసంస్థల్లో ఈనెల 27 నుంచి 31 వరకు పరీక్షలు జరుగుతాయని ఆయన తెలిపారు. ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.


