News March 19, 2025

వట్టిచెరుకూరు: చిన్నారిపై వృద్ధుడి అత్యాచారం

image

బిస్కెట్ ప్యాకెట్ ఆశ చూపి ఏడేళ్ళ చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడో వృద్ధుడు. ఉమ్మడి గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలో ఈ అమానుషం జరిగింది. సీఐ రామానాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. కె.థామస్(55) ఇంటి పక్కనే ఉన్న చిన్నారిపై ఈ నెల 14న అత్యాచారం చేశాడు. అనారోగ్యంగా ఉన్న బాలికను తల్లిదండ్రులు ప్రశ్నించగా జరిగిన విషయాన్ని చెప్పింది. వృద్ధుడిపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News March 19, 2025

తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను బడ్జెట్ ప్రతిబింబించింది: మంత్రి సురేఖ

image

రాష్ట్ర బ‌డ్జెట్ మీద మంత్రి కొండా సురేఖ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. యావ‌త్ తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను రాష్ట్ర రెండో బ‌డ్జెట్‌ ప్రతిబింబించిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క నేతృత్వంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఇవాళ ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌ల అవసరాలను గుర్తించి త‌గిన మేర‌కు కేటాయింపులు చేయ‌డం హ‌ర్ష‌ణీయం అని మంత్రి అన్నారు.

News March 19, 2025

రీ స‌ర్వేలో పార‌ద‌ర్శ‌క‌త‌కు పెద్ద పీట‌: కలెక్టర్ 

image

జిల్లాలో స‌మ‌గ్ర భూ స‌ర్వేలో పార‌ద‌ర్శ‌క‌త‌కు పెద్ద‌పీట వేస్తున్నామ‌ని, అత్యంత జ‌వాబుదారీత‌నంతో భూ లెక్క‌ల‌ను ప‌క్కాగా తేల్చేందుకే రీస‌ర్వే నిర్వ‌హిస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ లక్ష్మీశ చెప్పారు. బుధ‌వారం ఆయన చంద‌ర్ల‌పాడు మండ‌లం, ఉస్తేప‌ల్లి గ్రామ ప‌రిధిలో జ‌రుగుతున్న గ్రామ స‌రిహ‌ద్దుల నిర్ధార‌ణ‌, రెండో ద‌శ రీస‌ర్వే డేటా సేక‌ర‌ణ కార్య‌క‌లాపాల‌ను త‌నిఖీ చేశారు. ఆయన పలు శాఖల అధికారులు, తదితరులు ఉన్నారు.

News March 19, 2025

రామగుండం: సమన్వయం, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి: CP

image

పోలీసు సిబ్బంది సమన్వయం, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. కమిషనరేట్ లో ‘పోలీస్ దర్బార్’ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. పోలీసు అధికారులు, సిబ్బంది ఎలాంటి సమస్యలున్న నేరుగా తన దృష్టికి తీసుకురావాలన్నారు. తద్వారా పరిష్కరిస్తామన్నారు. పోలీసులు తమ విధుల్లో నిర్లక్ష్యం వహించిన, పోలీసు శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

error: Content is protected !!