News March 19, 2025
ఇంకోసారి అలా అనొద్దు.. ABDకి కోహ్లీ సూచన

ఐపీఎల్-2025కి ముందు ఆర్సీబీ మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ‘ఈసాల కప్ నమ్దే’ (ఈసారి కప్ మనదే) నినాదాన్ని ఇకపై పబ్లిక్‌లో వాడొద్దని కోహ్లీ తనకు మెసేజ్ చేసినట్లు తెలిపారు. ‘వరల్డ్ కప్‌ను ఈజీగా గెలవచ్చేమో కానీ ఐపీఎల్ ట్రోఫీని గెలవడం అంత సులభం కాదు. ఈ టోర్నీ చాలా కఠినతరంగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. 2011-21 మధ్య ABD ఆర్సీబీకి ఆడిన సంగతి తెలిసిందే.
Similar News
News March 19, 2025
గేట్‌లో తెలుగు విద్యార్థి సత్తా.. ఆలిండియా ఫస్ట్ ర్యాంక్

AP: నెల్లూరు (D) ఆమంచర్లకు చెందిన సాదినేని నిఖిల్ గేట్‌లో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్‌తో మెరిశారు. డేటా సైన్స్, AI టెస్ట్ పేపర్‌లో 100కు గానూ 96.33 మార్కులతో ఈ ఘనత సాధించారు. గతంలో నీట్ పరీక్షలోనూ 57వ ర్యాంకు సాధించిన ఈయన ప్రస్తుతం నోయిడాలో ఎక్స్‌పర్ట్‌డాక్స్ అనే సంస్థలో పని చేస్తున్నారు. AIలో ఎంటెక్ చేయాలన్న తన కల సాకారం చేసుకునే లక్ష్యంతోనే కష్టపడి చదివినట్లు నిఖిల్ వివరించారు.
News March 19, 2025
IPL అభిమానులకు పోలీసుల సూచన!

ఉప్పల్ స్టేడియంలో ఆదివారం నుంచి IPL మ్యాచులు జరగనున్నాయి. ఈక్రమంలో స్టేడియంలోకి తేకూడని వస్తువులను పోలీసులు సూచించారు. ‘కెమెరాలు& రికార్డింగ్ పరికరాలు, బ్లూటూత్ హెడ్‌ఫోన్స్ & ఎయిర్‌పాడ్స్, సిగరెట్, అగ్గిపెట్టె, కత్తులు, గన్స్, వాటర్ & ఆల్కహాల్ బాటిల్స్, పెట్స్, తినుబండారాలు, బ్యాగ్స్, ల్యాప్‌టాప్స్, సెల్ఫీ స్టిక్స్, హెల్మెట్, బైనాక్యులర్, టపాసులు, డ్రగ్స్’ వంటివి తీసుకురాకూడదని పోలీసులు తెలిపారు.
News March 19, 2025
ఫ్రిజ్‌లో 12 టన్నుల మేక మాంసం..!

హైదరాబాద్‌లోని మంగళ్‌హట్‌లో రూ.8 లక్షలు విలువ చేసే 12 టన్నుల మేక మాంసాన్ని GHMC టాస్క్ ఫోర్స్ సిబ్బంది సీజ్ చేశారు. మహమ్మద్ అఫ్రోజ్ అనే వ్యాపారి తక్కువ ధరకు గొర్రెలు, మేకల మాంసాన్ని కొని ప్రిజ్‌లో భద్రపరుస్తున్నట్లు గుర్తించారు. ఇలా నిల్వచేసిన మాంసాన్ని హోటళ్లు, శుభకార్యాలకు సప్లై చేస్తున్నట్లు తేల్చారు. ఈ ఘటనతో రెస్టారెంట్లలో తినే ముందు ఆలోచించాల్సిందేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.