News March 19, 2025
అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపింది వీరే!

దాదాపు 9 నెలల తర్వాత ISS నుంచి భూమికి చేరిన సునీతా విలియమ్స్‌పై ప్రపంచం దృష్టి నెలకొంది. కాగా అంతరిక్షంలో ఒకే ప్రయాణంలో అత్యధిక రోజులు గడిపిన వ్యక్తుల్లో వాలేరి పోలికోవ్(రష్యా-437 డేస్) తొలి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత ఫ్రాంక్ రుబియో(US-371d), మార్క్ వాండె(355), స్కాట్ కెల్లీ(340) ఉన్నారు. సునీత, విల్మోర్ తలో 286 డేస్ అంతరిక్షంలో ఉన్నారు. కాగా సునీత తన మూడు ప్రయాణాల్లో 608 రోజులు రోదసిలో ఉన్నారు.
Similar News
News January 12, 2026
విజయ్‌పై సీబీఐ ప్రశ్నల వర్షం

కరూర్ తొక్కిసలాటపై TVK చీఫ్ విజయ్‌పై CBI ప్రశ్నల వర్షం కురిపించింది. ‘బహిరంగ సభకు ఆలస్యంగా ఎందుకు వచ్చారు? రాజకీయశక్తిని ప్రదర్శించడం కోసమే అలా చేశారా? జనసమూహంలో కారు నుంచి ఎందుకు బయటకు వచ్చారు? సభలో ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నా మీరెందుకు ప్రసంగం కొనసాగించారు? నీళ్ల బాటిళ్లను ఎందుకు పంపిణీ చేశారు?’ అని ప్రశ్నించింది. ర్యాలీకి ముందు పార్టీ నేతలతో సమావేశాలపైనా ఆరా తీసింది.
News January 12, 2026
ఉద్యోగం భద్రంగా ఉండాలంటే?

ఏ సంస్థలైనా తక్కువతో ఎక్కువ లాభం వచ్చే వనరులపైనే ప్రధానంగా దృష్టి పెడతాయి. కాబట్టి ఎలాంటి స్థితిలోనైనా బాధ్యత తీసుకునే తత్వం ఉండాలి. పలానా వ్యక్తి పనిచేస్తే పక్కాగా ఉంటుందనే పేరును తెచ్చుకోవాలి. ఇది ఒక్కరోజులో వచ్చేది కాదు కాబట్టి దానికోసం శ్రమించాలి. పని గురించి అప్డేట్‌గా ఉండాలి. ఎన్ని బాధ్యతలున్నా మరీ ఎక్కువగా సెలవులు పెట్టకూడదు. ఆఫీసుకు వెళ్లేది పనిచేసేందుకే కాబట్టి దానిపై దృష్టి పెట్టాలి.
News January 12, 2026
గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్(<


