News March 19, 2025
ఎస్.అన్నవరం: రోడ్డు ప్రమాదంలో వైసీపీ నేత మృతి

తుని మండలం ఎస్.అన్నవరం గ్రామానికి చెందిన వైసీపీ నేత కుసనం దొరబాబు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బుధవారం తెల్లవారుజామున తుని రైల్వే స్టేషన్ నుంచి ద్విచక్రవాహనంపై ఆయన స్వగ్రామం ఎస్.అన్నవరం వెళుతుండగా కుక్కలు అడ్డురావడంతో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మరణించారు. ఆయన భార్య ఎస్.అన్నవరంలో ఓ సెగ్మెంట్‌కి ప్రస్తుతం ఎంపీటీసీగా ఉన్నారు.
Similar News
News January 5, 2026
సూర్యాపేట: ట్యాంకర్ ఢీకొని అసిస్టెంట్ మేనేజర్ మృతి

తిరుమలగిరి మండలం తొండ గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ సతీష్ (45) దుర్మరణం చెందారు. తన స్వగ్రామం ఐనోలు నుంచి వస్తుండగా, ఎదురుగా వచ్చిన పెట్రోల్ ట్యాంకర్ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 5, 2026
నీళ్లు వృథా కాకుండా ఎవరైనా వాడుకోవచ్చు: సీఎం చంద్రబాబు

AP: ఏటా కృష్ణా, గోదావరి నుంచి వేల టీఎంసీలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని తెలుగు మహా సభలో సీఎం చంద్రబాబు తెెలిపారు. అందుకే ఉమ్మడి ఏపీలోనూ ఎన్నో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. ఇప్పుడూ నీళ్లు వృథా కాకుండా ఎవరు వాడుకున్నా ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఇక నదుల అనుసంధానంతో దేశంలో నీటి సమస్య లేకుండా చేయాలని సీఎం చెప్పారు. గంగా-కావేరీ, గోదావరి-పెన్నా నదులు కలవాలన్నారు.
News January 5, 2026
ఆదిలాబాద్: గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. 2012 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ రాథోడ్ విలాస్(38) సోమవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయన, సోమవారం ఉదయం ఇచ్చోడలోని తన స్వగృహంలో ఉండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచారు.


