News March 19, 2025
పెద్దపల్లి: ఈ- హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌పై అవగాహన సదస్సు

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అన్నా ప్రసన్న కుమారి ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్ లకు అవగాహన సదస్సు నిర్వహించారు. డేటా ఎంట్రీ చేయుటకు డిజిగ్నేటెడ్ చేయబడిన సిబ్బందికి eHMIS(ఈ – హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) పైన శిక్షణ ఇచ్చారు. రోగుల వివరాలు డిజిటలైజేషన్ చేయడానికి ఈ పోర్టల్ ఏర్పాటు చేశారని తెలిపారు.
Similar News
News March 19, 2025
మంత్రివర్గ ఉప సంఘం భేటీలో నెల్లూరు మంత్రులు

అమరావతిలోని సచివాలయంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘం బుధవారం భేటీ అయ్యింది. ఈ భేటీకి నెల్లూరు మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ హాజరయ్యారు. భూ పరిపాలన సంస్కరణలపై వారు చర్చించారు. ప్రధానంగా మంత్రి వర్గ ఉప సంఘంలో ఫ్రీ హోల్డ్ భూములపై చర్చ సాగింది.
News March 19, 2025
ప్రైవేట్ బ్యాంకర్లు భాగస్వామ్యం కావాలి: నెల్లూరు జేసీ

ఎంఎస్‌ఎంఈ రుణాలతో అన్ని రంగాల ఆర్థిక పరిపుష్టి సాధ్యమని, ఎంఎస్‌ఎంఈ రుణాల మంజూరులో ప్రైవేటు బ్యాంకర్లు తప్పనిసరిగా భాగస్వామ్యం కావాలని జాయింట్ కలెక్టర్ కె కార్తీక్ కోరారు. బుధవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో జిల్లాస్థాయి బ్యాంకర్ల సమితి సమావేశం జేసీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడారు.
News March 19, 2025
పరిశ్రమల్లో ప్రమాదాలు తలెత్తకుండా భద్రతా ప్రమాణాలు పాటించండి: జేసీ

పరిశ్రమల్లో ఆకస్మిక ప్రమాదాలు సంభవించినప్పుడు పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ పరిశ్రమల యాజమాన్యాలను సూచించారు. బుధవారం నంద్యాల కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ సమావేశాన్ని నిర్వహించారు. ప్రమాదాలు జరిగినప్పుడు సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలన్నారు.