News March 19, 2025
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా డా.నందకుమార్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠాత్మకమైన కాళోజి నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా డాక్టర్ నందకుమార్ రెడ్డి నియమిస్తూ కొద్ది సేపటి క్రితం యూనివర్సిటీ ఛాన్సలర్, గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవిలో నందకుమార్ రెడ్డి మూడేళ్లు కొనసాగనున్నారు.
Similar News
News March 19, 2025
KMR: నిర్మాణాలు వేగవంతం చేయాలి: కలెక్టర్

మోడల్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, రెండు పడక గదుల ఇళ్ల కాలనీలకు మిషన్ భగీరథ నీటి సరఫరాలపై సంబంధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. బ్లాక్ మేకింగ్ యూనిట్ల తయారీకి మహిళా సంఘాలకు యూనిట్లు మంజూరు చేయాలన్నారు. అదనపు కలెక్టర్ వి.విక్టర్, ZP సీఈవో చందర్ ఉన్నారు.
News March 19, 2025
మా పోరాటంతోనే ఎస్సీ వర్గీకరణ చట్టం: మందకృష్ణ

మూడు దశాబ్దాల పాటు ఎస్సీ వర్గీకరణపై తాము చేపట్టిన పోరాట ఫలితమే వర్గీకరణకు చట్ట రూపం దాల్చిందని పద్మశ్రీ మందకృష్ణ మాది అన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన క్లబ్‌లో మాట్లాడుతూ.. వర్గీకరణ చట్ట రూపం దాల్చడంతో నెలరోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా సభలు, విజయోత్సవం నిర్వహిస్తామన్నారు. చట్టం మా చేతిలో పెట్టి ఉద్యోగాలన్నీ వారికి దోచి పెట్టారన్నారు.
News March 19, 2025
కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీకి కొత్త వైస్ ఛాన్స్‌లర్

కాళోజి నారాయణ రావు హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీకి కొత్త వైస్ ఛాన్స్‌లర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ పీవీ నందకుమార్ రెడ్డిని నియమిస్తూ తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ నియమించారు. ఇతడు మూడు సంవత్సరాలు కొనసాగుతారని నియామక పత్రంలో తెలిపారు. నేడు లేక రేపు కొత్త వైస్ ఛాన్స్‌లర్ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.