News March 19, 2025

పెద్దేముల్ మండలంలో తెల్లవారుజామున హత్య

image

పెద్దేముల్ మండలంలోని హన్మాపూర్ గ్రామంలో బుధవారం తెల్లవారుజామున హత్య జరిగింది. గ్రామానికి చెందిన బక్కని వెంకటేష్‌ను హత్య చేసినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హన్మాపూర్ వరుస హత్యలు కలవర పెడుతున్నాయి.

Similar News

News November 1, 2025

ADB: జాతీయ గౌరవ దివాస్‌లో పాల్గొన్న ఎంపీ నగేశ్

image

హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన జాతీయ గౌరవ దివాస్ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బీర్సా ముండా 150వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్యం కోసం ఆంగ్లేయులతో పోరాడి అమరుడైన గొప్ప నాయకుడు బీర్సా ముండా అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో MLA పాయల్ శంకర్ పాల్గొన్నారు.

News November 1, 2025

ADB: మాజీ మంత్రి హరీష్ రావును పరామర్శించిన MP నగేశ్

image

మాజీ మంత్రి, MLA తన్నీరు హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ శనివారం హరీష్ రావు నివాసంలో శనివారం పరామర్శించారు. సత్యనారాయణ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.

News November 1, 2025

హుస్సేన్‌సాగర్‌లో యువతి మృతదేహం కలకలం

image

హుస్సేన్‌సాగర్‌లో యువతి మృతదేహం(22) కలకలం రేపింది. లేక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని యువతి మృతదేహం నీటిలో తేలియాడుతుందని ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్‌కు చేరుకున్న లేక్ సిబ్బంది డెడ్‌బాడీని బయటకు తీసి, గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాపు చేపట్టారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.