News March 19, 2025
సిద్దిపేట: ముగ్గురు ఎంపీడీవోలకు పదోన్నతి

సిద్దిపేట జిల్లాలో పనిచేస్తున్న ముగ్గురు ఎంపీడీవోలకు డిప్యూటీ సీఈవోలుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిద్దిపేట జిల్లాలో ఎంపీడీవోలుగా పనిచేస్తున్న ఏ. ప్రవీణ్, జయరాం, ఏపీడీగా పనిచేస్తున్న శ్రీనివాస్ గౌడ్‌లకు డిప్యూటీ సీఈవోలుగా పదోన్నతి కల్పిస్తూ పంచాయతీ రాజ్ డైరెక్టర్ శ్రీజన ఉత్తర్వులు వెలువరించారు.
Similar News
News March 19, 2025
KMR: అందరికీ ఆమోదయోగ్య బడ్జెట్: షబ్బీర్ అలీ

TG అసెంబ్లీలో డీప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల వారికి ఈ ఆమోద యోగ్యమైనదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. పట్టణాభివృద్ధితో పాటు పల్లెల అభివృద్ధికి ఈ బడ్జెట్లో పెద్దపీట వేశారన్నారు. అలాగే మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి రంగాలకే బడ్జెట్లో అధిక నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు.
News March 19, 2025
కరీంనగర్: మాదకద్రవ్యాల నిర్మూలనకు పకడ్బందీ చర్యలు: కలెక్టర్

మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మత్తుపదార్థాల నిర్మూలనలో భాగంగా పోలీస్, ఎక్సైజ్ సహా వివిధశాఖల అధికారులతో బుధవారం ఆమె సమన్వయ సమావేశం నిర్వహించారు. కళాశాలలో వివిధ వసతి గృహాలను సందర్శించాలన్నారు. అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసే విద్యార్థులు పెడదోవ పట్టకుండా చూడాలని ఆదేశించారు.
News March 19, 2025
KMR: నిర్మాణాలు వేగవంతం చేయాలి: కలెక్టర్

మోడల్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, రెండు పడక గదుల ఇళ్ల కాలనీలకు మిషన్ భగీరథ నీటి సరఫరాలపై సంబంధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. బ్లాక్ మేకింగ్ యూనిట్ల తయారీకి మహిళా సంఘాలకు యూనిట్లు మంజూరు చేయాలన్నారు. అదనపు కలెక్టర్ వి.విక్టర్, ZP సీఈవో చందర్ ఉన్నారు.