News March 19, 2025
నేడే బడ్జెట్.. జనగామ జిల్లాకూ కావాలి నిధులు..!

నేడు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో జనగామ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న చెన్నూరు రిజర్వాయర్, పాలకుర్తి రిజర్వాయర్, జనగామ మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, ఇండస్ట్రియల్ పార్కులు, పాలకుర్తిలో 100 పడకల ఆసుపత్రితో పాటు పలు కొత్త ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News March 19, 2025
ట్యాక్స్ వసూళ్లలో జమ్మికుంటకు మొదటి స్థానం

ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లలో జమ్మికుంట మున్సిపాలిటీ 100% లక్ష్యాన్ని సాధించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ అయాజ్ మాట్లాడుతూ.. ఈ ఘనత ప్రజల సహకారంతోనే సాధ్యమైందని.. అధికారులు, సిబ్బంది ముందుగా కార్యచరణ రూపొందించుకొని సమర్థవంతంగా పనిచేయడంతోనే ఈ లక్ష్యాన్ని సాధించామన్నారు. జమ్మికుంట మున్సిపాలిటీ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు.
News March 19, 2025
శ్రీశైల పశ్చిమ ద్వారం మన అలంపురం..!

శ్రీశైలం పశ్చిమ ద్వారంగా పరిగణించబడి తుంగభద్ర నది తీరాన ఉన్నది. ఇక్కడ పురాతనమైన శైవ శివలయాలు, బాధమీ చాళుక్య శిల్పా సంపద, సంస్కృతిని సూచిస్తున్నాయి. ఆలయంలో ప్రధాన దేవుళ్లుగా బాల బాలబ్రహ్మేశ్వర, జోగులాంబ అమ్మవారు కొలువయ్యారు. మహాశక్తి పీఠాల్లో ఒకటిగా, అష్ట దశ ఆలయ సమూహాల్లో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా, తీర్థ యాత్రల ప్రదేశంగా భక్తులను అమితంగా ఆకట్టుకుంటోంది.
News March 19, 2025
మహిళ హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష

మహిళ హత్య కేసులో నిందితుడికి న్యాయస్థానం యావజ్జీవ శిక్ష విధించిందని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి చెప్పారు. 2013 మార్చి నెలలో రాణి అనే మహిళను రాజశేఖర్ అనే వ్యక్తి బాపట్ల మండలం అడవి పంచాయతీలోని శిథిలావస్థలో ఉన్న భవనంలో కత్తితో దాడి చేసి హత్య చేశాడన్నారు. బుధవారం న్యాయస్థానం నిందితుడికి శిక్షను ఖరారు చేసిందన్నారు. శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించినట్లు తెలిపారు.