News March 19, 2025
2025-26 బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం

TG: 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కాసేపట్లో అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు నల్లపోచమ్మ గుడిలో బడ్జెట్ ప్రతులను ఉంచి భట్టి ప్రత్యేక పూజలు చేయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇదే తొలి సారి. కాగా బడ్జెట్ రూ.3లక్షల కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా.
Similar News
News November 1, 2025
లవ్ స్టోరీ చెప్పేసిన అల్లు శిరీష్

<<18163585>>నిశ్చితార్థం<<>> చేసుకున్న టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ తన లవ్ స్టోరీని ఇన్‌స్టాలో వెల్లడించారు. 2023లో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వివాహ సమయంలో నితిన్, శాలిని కందుకూరి ఇచ్చిన పార్టీలో నయనికను కలుసుకున్నట్లు తెలిపారు. అలా ప్రేమ మొదలవ్వగా సరిగ్గా రెండేళ్లకు ఆమెను ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు చెప్పారు. ‘‘భవిష్యత్తులో నా పిల్లలు మా కథ ఎలా ప్రారంభమైందని అడిగితే ‘ఇలానే మీ అమ్మను కలిశా’ అని చెబుతా’’ అంటూ రాసుకొచ్చారు.
News November 1, 2025
గర్భవతిని చేసేవారు కావాలంటూ ₹11 లక్షలకు టోకరా

సైబర్ నేరగాళ్లు వేర్వేరు మార్గాల్లో మోసాలు చేస్తున్నారు. తాజాగా ‘గర్భవతిని చేయగల పురుషుడి కోసం ఎదురుచూస్తున్నాను’ అనే ఆన్‌లైన్ యాడ్ ఇచ్చి పుణేకు చెందిన కాంట్రాక్టర్‌ను ₹11Lకు బురిడీకొట్టించారు. ఆయన కాల్ చేయగా ఓ యువతి తన వీడియో పంపింది. ఆపై సైబర్ ముఠా ఫీజుల పేరిట డబ్బు వసూలు చేసింది. అనుమానంతో పోలీసుల్ని ఆశ్రయించగా మోసమని తేలింది. ప్రెగ్నెంట్ జాబ్, ప్లేబాయ్ పేరిట ఇది జరుగుతున్నట్లు గుర్తించారు.
News November 1, 2025
‘ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్’ అంటే..

ఇదొక దీర్ఘకాలిక జీర్ణశయాంతర సమస్య. ఈ సిండ్రోమ్ ఉన్నవారిలో మెదడు, పేగులు కలిసి పనిచేయవు. దీనివల్ల పేగుల్లో సున్నితత్వం పెరుగుతుంది. కడుపు నొప్పి, ఉబ్బరం, విరేచనాలు, మలబద్ధకం, నిద్రలేమి, ఒత్తిడి వంటి లక్షణాలు కనిపిస్తాయి. రక్తం, మల పరీక్షలతో ఈ వ్యాధిని నిర్ధారిస్తారు. తక్కువ క్వాంటిటీలో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవడం, ఫ్యాట్, ప్రాసెస్డ్, కారంగా ఉండే ఫుడ్స్‌కు దూరంగా ఉంటే ఈ సమస్యను అదుపుచేయవచ్చు.


