News March 19, 2025
నంద్యాల: ఇద్దరు అధికారులు సస్పెండ్ సస్పెండ్.. విధుల్లో చేరేందుకు పైరవీ..?

శ్రీశైలం ప్రాజెక్టు జలవనరుల శాఖకు చెందిన ఇద్దరు EEలను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఇద్దరు అధికారులను గతేడాది సెప్టెంబరులో శ్రీశైలానికి బదిలీ చేసింది. అయితే వారు ఇప్పటికీ విధుల్లో చేరలేదు. దీంతో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్.. తాజాగా వారిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం వారు విధుల్లో చేరేందుకు కార్యాలయం వద్ద పైరవీలు చేస్తున్నట్లు సమాచారం.
Similar News
News November 8, 2025
జూబ్లీ బైపోల్: మాగంటి మరణం చుట్టూ రాజకీయం

చావు కూడా రాజకీయాలకు అతీతం కాదని ప్రస్తుత జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం నిరూపిస్తోంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం మిస్టరీ అని, దానిని ఛేదించాలని కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. సీఎం మరో ముందడుగు వేసి ఈ విషయంపై బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం విచారణ చేస్తుందని పేర్కొన్నారు. దీంతో బైపోల్ పాలిటిక్స్ పీక్ స్థాయికి చేరుకున్నాయి.
News November 8, 2025
ఎడ్యుకేషనల్ హబ్‌గా కుప్పం: సీఎం చంద్రబాబు

AP: కుప్పంలో రూ.2,203కోట్ల పెట్టుబడితో 7 సంస్థల ఏర్పాటుకు CM చంద్రబాబు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘కుప్పంను ఎడ్యుకేషనల్ హబ్‌గా మారుస్తాం. ప్రైవేట్, రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రోత్సహిస్తాం. ఇప్పటికే యూనివర్సిటీ, మెడికల్, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీలున్నాయి’ అని తెలిపారు. కుప్పంలో ల్యాప్‌టాప్, మొబైల్ యాక్సెసరీస్ వంటి 7 సంస్థలకు ప్రభుత్వం 241 ఎకరాలు కేటాయించింది.
News November 8, 2025
హెలికాప్టర్ పేరెంటింగ్ గురించి తెలుసా?

పిల్లల జీవితాల్లో తల్లిదండ్రులు అతిగా జోక్యం చేసుకునే విధానాన్ని హెలికాప్టర్ పేరెంటింగ్ అంటారు. పిల్లల భవిష్యత్తు గురించి విపరీతమైన ఆందోళన చెందుతారు. ప్రతి సమస్య నుండి తమ బిడ్డను రక్షించడానికి సాయం చేయాలనుకుంటారు. అయితే వారి మితిమీరిన జోక్యం భవిష్యత్తులో పిల్లలకి సమస్యగా మారుతుందంటున్నారు నిపుణులు. పిల్లలను ఎదగనివ్వాలని, వారిని సొంతంగా నిర్ణయాలు తీసుకొనేలా ప్రోత్సహించాలని వారు చెబుతున్నారు.


