News March 19, 2025
ఎనుమాముల మార్కెట్‌లో భారీగా పెరిగిన పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి పత్తి తీసుకొని వచ్చిన రైతులకు ధర విషయంలో ఊరట లభించింది. ఎట్టకేలకు నేడు క్వింటా పత్తి ధర రూ.7 వేల మార్కు దాటింది. సోమవారం రూ.6,825 పలికిన క్వింటా పత్తి ధర.. మంగళవారం రూ.6,975కి చేరింది. బుధవారం మరింత పెరిగి రూ.7100 అయింది. రెండు రోజుల వ్యవధిలోనే రూ.275 ధర పెరగడం పట్ల అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News January 4, 2026
వనపర్తి: మాధురానగర్‌లో అప్పుల బాధతో ఆత్మహత్య

వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక మధురానగర్‌లో వనపర్తి జిల్లా ఆత్మకూరుకు చెందిన రవి(25) అనే వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన రవి, చికిత్స పొందుతూ మృతి చెందాడు. వడ్డీ వ్యాపారుల ఒత్తిడి వల్లే రవి ఈ నిర్ణయం తీసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మధురానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News January 4, 2026
రేవంత్ నాలుక కోయాలి: హరీశ్ రావు

తెలంగాణ ఏర్పడ్డాక 42 రోజుల్లోనే కృష్ణాలో 69% నీళ్ల కోసం కేంద్రానికి KCR లేఖ రాశారని హరీశ్ రావు తెలిపారు. ‘కాంగ్రెస్, TDP ద్రోహం వల్లే కృష్ణాలో 299 TMCలు వచ్చాయి. కానీ గోదావరిలో 933 TMCలకు మేం అనుమతులు సాధించాం. సభలో అబద్ధాలు చెప్పిన సీఎం రాజీనామా చేయాలి. అబద్ధాలు చెప్పినందుకు రేవంత్ నాలుక కోయాలి. ఇలా మాట్లాడుతున్నందుకు నాపై దాడి చేయించవచ్చు. అవసరమైతే హత్యాయత్నం చేయించవచ్చు’ అని కామెంట్ చేశారు.
News January 4, 2026
VKB: 630 కుక్కలకు స్టెరిలైజేషన్: ఏసుదాస్

పట్టణంలో 630 వీధి కుక్కలను పట్టి వాటికి స్టెరిలైజేషన్ చేసి ఆహారం అందిస్తున్నామని వికారాబాద్ మునిసిపల్ ఇన్‌ఛార్జి శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ ఏసుదాస్ తెలిపారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలోని జనన నియంత్రణ కేంద్రంలో ఆపరేషన్లు చేసిన కుక్కలకు ఆహారం అందించారు. కుక్కలను నియంత్రించేలా వాటి సంఖ్యను పెరగకుండా ఆపరేషన్లు చేసి వాటి ఆరోగ్యాన్ని పరిరక్షించి వదిలిపెడతామని తెలిపారు.


