News March 19, 2025

చిన్న శ్రీను కుమారుడి మృతి

image

విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్, భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు రెండో కుమారుడు ప్రణీత్ నేడు మృతి చెందారు. 2020లో ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రణీత్ 4 సంవత్సరాల 10 నెలల పాటు మృత్యువుతో పోరాడాడు. చివరకు విశాఖలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారు.

Similar News

News March 19, 2025

తిరుపతి: కప్ కైవసం చేసుకున్న పోలీస్ జట్టు

image

తిరుపతి తారకరామా స్టేడియంలో జరిగిన మెగా కార్పొరేట్ క్రికెట్ లీగ్ T-20 టోర్నమెంట్‌లో అమర్ రాజా టీంపై పోలీస్ జట్టు ఘనవిజయం సాధించింది. క్రికెట్ ట్రోర్నమెంట్ లో రాఘవులు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకున్నారు. ఆరు మ్యాచ్‌లలో 572 పరుగులు సాధించి అతను  ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా తిరుపతి ఎస్పీ హర్షవర్దన్ రాజు వారిని అభినందించారు.

News March 19, 2025

VZM: ZP ఛైర్మన్‌కు మాజీ CM జగన్ పరామర్శ

image

విజయనగరం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాస్ రెండో కుమారుడు ప్రణీత్ బాబు బుధవారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్ ఫోన్‌లో చిన్న శ్రీనును పరామర్శించారు. మృతికి గల కారణాన్ని అడిగి తెలుసుకున్నారు. చిన్న శ్రీను కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లోనే మనోధైర్యంగా ఉండాలంటూ జగన్ ధైర్యం చెప్పారు.

News March 19, 2025

గుంటూరు: మంచినీటి చలివేంద్రం ప్రారంభించిన కలెక్టర్ 

image

జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రంను బుధవారం సాయంత్రం కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ, సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ తేజతో కలసి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్‌కే ఖాజావలీ, డిప్యూటీ కలెక్టర్ గంగరాజు, కలెక్టరేట్ కార్యాలయం అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. 

error: Content is protected !!